రాజ‌మౌళిని.. ఢీ కొట్టే స‌రైన పోటీదారు వ‌చ్చాడుగా!

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:06 PM

 పోటీ అన్నది ప్రతి రంగంలోనూ ఏదో ఒక రూపంలో చోటు చేసుకుంటూనే ఉంటుంది... సినిమారంగంలో ఆ పోటీతత్వం మరింత ఎక్కువగా కనిపిస్తుంది...  ఇప్పుడు రాజమౌళికి పోటీదారు 'ధురంధర్' డైరెక్టర్ ఆదిత్య ధర్ అంటున్నారు...

rajamouli

 పోటీ అన్నది ప్రతి రంగంలోనూ ఏదో ఒక రూపంలో చోటు చేసుకుంటూనే ఉంటుంది... సినిమారంగంలో ఆ పోటీతత్వం మరింత ఎక్కువగా కనిపిస్తుంది...  ఇప్పుడు రాజమౌళికి పోటీదారు 'ధురంధర్' డైరెక్టర్ ఆదిత్య ధర్ అంటున్నారు... ఇంతకూ ఏమిటి కహానీ?...
 

రాజమౌళి పోటీదారు... అతనొక్కడే!

మొన్నటి దాకా మన దేశంలో వెయ్యి కోట్ల క్లబ్ లో రెండు సినిమాలు గల ఏకైక దర్శకునిగా రాజమౌళి రాజ్యమేలారు. ఆయన రూపొందించిన 'బాహుబలి-ద కంక్లూజన్'తోనే అసలు వెయ్యి కోట్ల క్లబ్ కు తెరలేచింది. ఆ తరువాతే 'దంగల్' మూవీ వేరే దేశాల్లో వచ్చిన కలెక్షన్స్ తో 'బాహుబలి-2'ను అధిగమించింది. ఆ పై వరుసగా కొన్ని సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్ లో చోటు సంపాదిస్తూ సాగాయి. హీరోల్లో ప్రభాస్ తన "బాహుబలి-2, కల్కి-1" సినిమాలతో ఆ క్లబ్ లో చోటు దక్కించుకోగా, షారుఖ్ ఖాన్ ఒకే ఏడాది "పఠాన్, జవాన్" చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక రికార్డ్ సంపాదించారు. ఇప్పుడు వెయ్యి కోట్ల దర్శకుల జాబితాలో రాజమౌళి లాగే రెండేసి చిత్రాలున్న దర్శకునిగా 'ధురంధర్' డైరెక్టర్ ఆదిత్య ధర్ నిలిచారు. 'ధురంధర్-1' మూవీ టోటల్ రన్ లో 1400 కోట్లకు పైగా పోగేసింది. 'ధురంధర్-2' జనం ముందుకు వచ్చి రెండు వారాలు కాకుండానే 1300 కోట్లకు పైగా రాబట్టింది. ఇంకా సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. కేవలం రెండు వారాలలోనే ఇంత మొత్తం పోగేసిన ఘనతతో రాజమౌళి రికార్డ్ ను ఆదిత్య ధర్ అధిగమించారని టాక్. ఈ నేపథ్యంలో రాజమౌళికి పోటీ ఇస్తున్న దర్శకుడు ఆదిత్య ధర్ మాత్రమే అంటున్నారు బాలీవుడ్ బాబులు.


ఇతరులకు టార్గెట్...


వాస్తవానికి రాజమౌళి రికార్డులు బద్దలు కొట్టాలనే లక్ష్యంతో ఏ నాడూ సినిమాలు తెరకెక్కించలేదు. తనదైన పంథాలో భారీతనంతో ప్రేక్షకులను అలరిస్తూ సాగుతున్నారాయన.  అందుకు 'బాహుబలి' సిరీస్, తరువాత 'ట్రిపుల్ ఆర్' చిత్రాలు నిదర్శనంగా నిలిచాయి. ప్రస్తుతం మహేశ్ బాబుతో రాజమౌళి రూపొందిస్తోన్న చిత్రం 'వారణాసి' కూడా వసూళ్ళ వర్షం కురిపిస్తూ సాగుతుందని ట్రేడ్ పండిట్స్ ఇప్పటి నుంచే అంచనా వేస్తున్నారు. అందువల్ల రాజమౌళికి గట్టి పోటీ ఇచ్చే దర్శకునిగా ఆదిత్య ధర్ ను ముందుకు తెచ్చారు కొందరు. అయితే రాజమౌళి ఎవరితోనూ పోటీ పడకుండా తన పంథాలో తాను పయనిస్తూ సాగుతున్నారు. ట్రేడ్ సర్కిల్స్ పోటీ అన్నంత మాత్రాన రాజమౌళి ఎవరితోనూ పోటీ పడే ఉద్దేశంలో లేరు. పైగా ఆయన సినిమాలు ఇతరులకు టార్గెట్ క్రియేట్ చేస్తూ సాగుతాయనీ పరిశీలకులు చెబుతున్నారు.


రేంజ్ ఏంటో...!?


ఏ రంగంలోనైనా పోటీ అన్నది సర్వసాధారణం. ఒకరు రికార్డులు నెలకొల్పితే మరొకరు బ్రేక్ చేస్తూ పోతుంటారు. క్రికెట్ రంగంలో డాన్ బ్రాడ్ మన్ రికార్డ్ ను సచిన్, తరువాత సచిన్ రికార్డ్ ను కోహ్లీ ఇలా బ్రేక్ చేసుకుంటూ పోయారు కదా అని కొందరు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్, సుకుమార్, అట్లీ, లోకేశ్ కనగరాజ్, సందీప్ రెడ్డి, 'రామాయణ' తెరకెక్కిస్తోన్న నితేశ్ తివారీ- వీరందరూ తమ రాబోయే చిత్రాలతో వెయ్యి కోట్లు సునాయాసంగా సంపాదిస్తారని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు.  వీరిలో ఎంతోమంది ప్రస్తుతం రాజమౌళి పేరిటి ఉన్న మరికొన్ని రికార్డులను బద్దలు చేయవచ్చు. అయితే రాజమౌళి రాబోయే మూవీ 'వారణాసి' ఎలాంటి రికార్డులు నెలకొల్పుతుంది. వాటిని ఎవరు బీట్ చేస్తారు అన్నదే  
 

Updated Date - Mar 31 , 2026 | 06:08 PM