Salaar 2: సలార్ 2 టీజర్ రిలీజ్ నిజమేనా.. నీల్ మావా

ABN , Publish Date - Jan 21 , 2026 | 07:24 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) లిస్ట్ లో సినిమాలకన్నా సీక్వెల్సే ఎక్కువ ఉన్నాయి అని చెప్పొచ్చు. అందులో సలార్ 2 (Salaar 2) ఒకటి.

Salaar 2

Salaar 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) లిస్ట్ లో సినిమాలకన్నా సీక్వెల్సే ఎక్కువ ఉన్నాయి అని చెప్పొచ్చు. అందులో సలార్ 2 (Salaar 2) ఒకటి. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం సలార్ పార్ట్ 1- సీజ్ ఫైర్. 2023 లో రిలీజైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రభాస్ ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక నీల్.. చివర్లో ప్రభాస్ ని శౌర్యంగగా చూపించడం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక ఆ పేరునే సెకండ్ పార్ట్ కి పెట్టాడు. సలార్ పార్ట్ 2- శౌర్యంగ పర్వం టైటిల్ తో సీక్వెల్ ప్రకటించిన నీల్.. ఇప్పటివరకు దాని ఊసే ఎత్తలేదు. అసలు ఇది ఉంటుందా.. ? లేదా.. ? అన్న విషయం కూడా క్లారిటీ లేదు.

సలార్ తరువాత ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేశాడు. డ్రాగన్ పేరుతో ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ని జరుపుకుంటుంది. ఇంకోపక్క ప్రభాస్ వరుస సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు. వాటికి సీక్వెల్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్నాడు. కానీ, ఒక్క సీక్వెల్ ని కూడా ఇప్పటివరకు పట్టాలెక్కించలేదు. అయితే సడెన్ గా సలార్ 2 టీజర్ రిపబ్లిక్ డేకి రిలీజ్ కానుందనే వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇది నిజమేనా.. నీల్ మావా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆలూ లేదు.. చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు.. అసలు నీల్ కానీ, ప్రభాస్ కానీ.. వీరెవ్వరూ కాదు కనీసం మేకర్స్ కూడా సలార్ 2 గురించి ఒక్క అప్డేట్ ఇచ్చింది కూడా లేదు. కనీసం శౌర్యంగ పర్వం సెట్స్ మీదకు వెళ్తుంది అన్న విషయం కూడా చెప్పింది లేదు. అంతలోనే టీజర్ ఎలా రిలీజ్ చేస్తున్నారు అనే అనుమానం నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. జనవరి 25 కానీ, 26 న కానీ సలార్ 2 టీజర్ రిలీజ్ అవుతుంది అని చెప్పడంలో కూడా ఎటువంటి లాజిక్ లేదు అని చెప్పుకొస్తున్నారు. మరికొందరు అసలు సలార్ 2 ఆగిపోయిందని, ఒకవేళ ఉన్నా ఇప్పుడప్పుడే సెట్స్ మీదకు వెళ్లదని, ఇలా అనవసరమైన రూమర్స్ క్రియేట్ చేయొద్దని హితవు పలుకుతున్నారు. మరి ఈ విషయమై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Updated Date - Jan 21 , 2026 | 07:24 PM