చరణ్ తో రొమాన్స్ చేయనున్న ఎన్టీఆర్ బ్యూటీ..
ABN , Publish Date - Aug 06 , 2026 | 03:28 PM
పెద్ది సినిమా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి మంచి కంబ్యాక్ అవుతుందేమో అనుకున్నారు. కానీ, ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకుంది. అయినా కూడా రికార్డ్ కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది.
పెద్ది సినిమా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కి మంచి కంబ్యాక్ అవుతుందేమో అనుకున్నారు. కానీ, ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకుంది. అయినా కూడా రికార్డ్ కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక ఇప్పుడు అందరి చూపు RC17 మీదనే ఉంది. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ , వర్సటైల్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబో సినిమాపై అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. పెద్ది సినిమా సమయంలో జరిగ ప్రమాదం వలన చరణ్ మణికట్టుకు దెబ్బ తగిలిన విషయం తెల్సిందే. ఆ గాయానికి ఈ మధ్యనే వైద్యులు సర్జరీ చేశారు. ప్రస్తుతం చరణ్ రెస్ట్ లో ఉన్నాడు. రెస్ట్ తరువాత RC17 మొదలుకనుంది.
ఇక ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కథానాయికగా సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ ను ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదించి కథలోని పాత్ర స్వభావాన్ని వివరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. ఆమె కూడా కథ నచ్చి ఓకే చెప్పడానికి సిద్దంగా ఉందని టాక్.
రుక్మిణి వసంత్ తన సహజమైన నటన, గ్లామర్‌తో సౌత్ ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, ప్రస్తుతం పలు క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతోంది. ఎన్టీఆర్ డ్రాగన్, యశ్ టాక్సిక్ లో రుక్మిణి నటిస్తోంది. ఇక ఇప్పుడు చరణ్ సరసన నటించే లక్కీ ఛాన్స్ పట్టేసింది. సుకుమార్ మార్క్ విలేజ్ అండ్ వింటేజ్ బ్యాక్‌డ్రాప్ డ్రామాలో చరణ్‌కు జోడీగా రుక్మిణి అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుందని టీమ్ భావిస్తోంది. త్వరలోనే ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.