రష్మిక బాట‌లో.. రుక్మిణి! టాలీవుడ్ పైన క‌న్ను

ABN , Publish Date - Feb 11 , 2026 | 08:21 PM

కన్నడ సోయగాలు టాలీవుడ్‌లో జెండా పాతడం కొత్తేమీ కాదు. గతంలో సౌందర్య నుంచి నేటి రష్మిక వరకు ఎందరో కన్నడ భామలు తెలుగు తెరపై స్టార్‌లుగా వెలిగిపోయారు.

Rukmini

కన్నడ సోయగాలు టాలీవుడ్‌లో జెండా పాతడం కొత్తేమీ కాదు. గతంలో సౌందర్య నుంచి నేటి రష్మిక మందన్న (Rashmika Mandanna) వరకు ఎందరో కన్నడ భామలు తెలుగు తెరపై స్టార్‌లుగా వెలిగిపోయారు. టాలీవుడ్ ఇచ్చే ఆదరణ, ఇక్కడ దక్కే రెమ్యూనరేషన్ వారిని ఇటు వైపు ఆకర్షిస్తున్నాయి. తాజాగా మరో కన్నడ సుందరి రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది.

Rukmini Vasanth

రష్మిక మందన్న విషయానికొస్తే, ఆమె ఇక్కడ స్టార్‌గా ఎదగడమే కాకుండా నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందింది. అయితే తన మాతృభాష కంటే తెలుగు చిత్రాలకే ఆమె పెద్దపీట వేస్తోందనే నెపం కన్నడ అభిమానుల్లో ఉంది. ఇదే కారణంతో సోషల్ మీడియాలో ఆమెపై తరచూ విమర్శలు వస్తుంటాయి. అయినప్పటికీ ఆ ప్రతికూలతలను దాటుకుంటూ రష్మిక తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది. ఇప్పుడు రుక్మిణి వసంత్ ప్రయాణం కూడా రష్మిక బాటలోనే సాగుతున్నట్లు కనిపిస్తోంది.

Rukmini Vasanth

'సప్త సాగరాలు దాటి' చిత్రంతో యువత మనసు దోచుకున్న ఈమె, ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ క్రేజీ ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కించుకుంది. ఈ భారీ ఆఫర్‌తో ఆమె పేరు ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోతోంది. ఒకవైపు తెలుగులో ఇంతటి గుర్తింపు తెచ్చుకుంటూనే, మరోవైపు ‘కాంతార చాప్టర్ 1’తో కన్నడలోనూ స్టార్ హోదాను దక్కించుకుంది. మాతృభాషలో స్టార్ హోదాను కాపాడుకుంటూనే, టాలీవుడ్‌లో టాప్ లీగ్ హీరోయిన్‌గా ఎదిగేందుకు ఆమె పావులు కదుపుతోంది.

Rukmini Vasanth

ప్రస్తుత టాలీవుడ్ మార్కెట్ రేంజ్ చూస్తుంటే, రుక్మిణికి ఇక్కడ తిరుగుండదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.టాలీవుడ్ ఇప్పుడు కేవలం ప్రాంతీయ భాషా చిత్రాలకే పరిమితం కాకుండా గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తోంది. ఇక్కడ నిలదొక్కుకుంటే బాలీవుడ్ అవకాశాలు కూడా వాటంతట అవే తలుపు తడతాయి. ఈ క్రమంలో రుక్మిణి కూడా తెలుగు సినిమాల వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు కన్నడ ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

rukminivasanth.jpg

నిజానికి స్టార్‌గా ఎదిగే క్రమంలో ఇతర భాషల్లో అవకాశాలు రావడం సహజం. రుక్మిణి కన్నడ చిత్రాలను బ్యాలెన్స్ చేస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఒకవేళ ఆమె కేవలం టాలీవుడ్ పైనే దృష్టి పెడితే మాత్రం, రష్మిక ఎదుర్కొన్న విమర్శలే రుక్మిణికి కూడా ఎదురయ్యే ప్రమాదం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. భాష ఏదైనా ప్రతిభ ఉన్న నటీనటులను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనేది వాస్తవం అంటున్నారు.

Rukmini.jpg

Updated Date - Feb 12 , 2026 | 12:41 AM