మంచు మనోజ్ చేతుల మీదుగా 'రుక్మిణి' టీజర్
ABN , Publish Date - Feb 27 , 2026 | 05:13 PM
నిరంజన్, గ్రీష్మ నేత్రికా , ప్రియ జాస్పర్, దీప్తి శ్రీరంగం నటీనటులుగా నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్న సినిమా 'రుక్మిణి'.
నిరంజన్ (niranjan), గ్రీష్మ నేత్రికా, ప్రియ జాస్పర్, దీప్తి శ్రీరంగం నటీనటులుగా నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్న సినిమా 'రుక్మిణి' (rukmini). హారర్ కామెడీ కథతో దర్శకుడు సింహాచలం గుడుపూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శుక్రవారం మంచు మనోజ్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ 'రుక్మిణి సినిమా టీజర్ అద్భుతంగా ఉంది. టీజర్ చూస్తుంటే డైరెక్షన్, డీవోపీ వర్క్, మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నట్లు తెలుస్తోంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అన్నారు.
డైరెక్టర్ సింహాచలం గుడుపూరి మాట్లాడుతూ 'కొత్త వారిని ఎంకరేజ్ చేయడంలో మంచు మనోజ్ ఎప్పుడూ ముందుంటారు. మా మూవీ టీజర్ రిలీజ్ చేసి సపోర్ట్ చేసినందుకు ఆయనకు మా టీమ్ అందరి తరుపున థ్యాంక్స్ చెబుతున్నాం. త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ తో మీ ముందుకు వస్తాం' అన్నారు.
నిర్మాత కట్టా గంగాధర్ రావు మాట్లాడుతూ 'మోహన్ బాబుగారి సినిమాలకు అప్రెంటిస్ గా వర్క్ చేయడంతో నా కెరీర్ మొదలైంది. ఈ మూవీ కథను దర్శకుడు సింహాచలం చాలా బాగా చెప్పారు. అంతే బాగా రూపొందిస్తున్నారు. నిరంజన్, గ్రీష్మ నేత్రిక, ప్రియ జాస్పర్, విఖ్యాత్, జయంత్..ఇలా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మెప్పిస్తారు. త్వరలోనే 'రుక్మిణి' సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం' అని అన్నారు.