అజ్ఞాతవాసి కాంబో రిపీట్ కావడానికి కారణం ఇదేనా..
ABN , Publish Date - Jun 30 , 2026 | 08:05 PM
ఎట్టకేలకు ఎన్టీఆర్ (NTR)- త్రివిక్రమ్ (Trivikram) కాంబో ఫిక్స్ అయ్యింది. అరవింద సమేత వీర రాఘవ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందులోనూ ఇది ఓ భారీ పౌరాణిక చిత్రం అని తెల్సిన దగ్గరనుంచి ఇండస్ట్రీలో దీని గురించే చర్చ.
ఎట్టకేలకు ఎన్టీఆర్ (NTR)- త్రివిక్రమ్ (Trivikram) కాంబో ఫిక్స్ అయ్యింది. అరవింద సమేత వీర రాఘవ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందులోనూ ఇది ఓ భారీ పౌరాణిక చిత్రం అని తెల్సిన దగ్గరనుంచి ఇండస్ట్రీలో దీని గురించే చర్చ. ఈ భారీ చిత్రానికి గాడ్ ఆఫ్ వార్ (God Of War) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినదగ్గర నుంచి అందరి దృష్టి మ్యూజిక్ డైరెక్టర్ పైనే ఉంది. త్రివిక్రమ్ సినిమా అంటే.. ఎక్కువ థమనే మ్యూజిక్ అందిస్తుంటాడు. కానీ, గాడ్ ఆఫ్ వార్ కి గురూజీ.. అనిరుధ్ ని ఎంపిక చేయడం సంచలనంగా మారింది. అయితే దానికి పెద్ద కారణం కూడా ఉందని టాక్ నడుస్తోంది.
కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరైన త్రివిక్రమ్, ఈసారి తన శైలిని మార్చుకుని మురుగన్ పురాణ గాథను తెరపై అద్భుతంగా ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. యుద్ధ సన్నివేశాల్లోని తీవ్రతను, ఉద్వేగాన్ని ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు చూపించాలనేది త్రివిక్రమ్ లక్ష్యం. అందుకే అనిరుధ్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్ అందించే ఎలక్ట్రానిక్ బీట్స్, శక్తివంతమైన శ్లోకాలతో కూడిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోయనుందట. టీజర్ నుండే ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా సౌండ్ డిజైన్ ఉండబోతోందట. ఈ సినిమా కోసం అనిరుధ్‌ను తీసుకోవడం వెనుక ఎన్టీఆర్ వ్యూహం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పాన్-ఇండియా స్థాయిలో సినిమా విజయం సాధించాలంటే కేవలం నటన మాత్రమే కాకుండా, సంగీతం కూడా కీలకమని ఆయన బలంగా నమ్ముతున్నారట. అందుకే ఇతర భాషల్లోనూ అనిరుధ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడంలో కీలక పాత్ర పోషించారట. త్రివిక్రమ్ పదునైన సంభాషణలు, అనిరుధ్ మ్యూజిక్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో అజ్ఞాతవాసి సినిమాతో నిరాశపరిచిన అనిరుధ్-త్రివిక్రమ్ కాంబినేషన్, ఇప్పుడు ఈ పౌరాణిక చిత్రంతో ఆ చేదు జ్ఞాపకాలను చెరిపేసి, ఘన విజయాన్ని అందుకోవడానికి సిద్ధమైంది. అప్పట్లో కథా పరంగా విమర్శలు వచ్చినప్పటికీ, అనిరుధ్ అందించిన సంగీతం మాత్రం చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అంతకు మించిన భారీ జానర్‌లో వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటం ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతోంది. అనిరుధ్ ప్రస్తుతం ఫామ్‌లో ఉండటం ఈ చిత్రానికి కలిసి వచ్చే అంశం. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించే ప్రయత్నం అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. త్రివిక్రమ్ ఈ చిత్రంతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.