రీతూ వర్మ - వైష్ణవ్ తేజ్ బ్రేకప్.. నిజమేనా
ABN , Publish Date - Jul 21 , 2026 | 05:02 PM
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రీతూ వర్మ (Ritu Varma), మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) లవ్ ట్రాక్‌లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రీతూ వర్మ (Ritu Varma), మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) లవ్ ట్రాక్‌లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభమైన వీరి సంబంధంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇద్దరు కలిసి ఒక్క సినిమా చేయకపోయినా నిహారిక ఫ్రెండ్ గా రీతూ మెగా ఫ్యామిలీకి దగ్గరయింది. నిహారిక, వరుణ్ తేజ్ పెళ్లిలో రీతూవర్మ చేసిన హంగామా అంతా ఇంతాకాదు. అప్పటినుంచే మెగా కోడలిగా రీతూ మారిందని వార్తలు వచ్చాయి. ఆ తరువాత సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ అన్నదమ్ములిద్దరికి ఒకే ఇంటి నుంచి వచ్చిన అక్కాచెల్లెళ్లను చూశారని, త్వరలోనే ఈ పెళ్లిళ్లు జరగనున్నాయని కూడా వార్తలు వచ్చాయి ఇక దీంతో వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందని, అందుకే కొంతకాలం దూరంగా ఉంటున్నారనే రూమర్స్ ఊపందుకున్నాయి.
అయితే, ఈ విడిపోయారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని, వీరిద్దరూ ఇప్పటికీ సీక్రెట్‌గా రిలేషన్‌షిప్‌లోనే ఉన్నారని సినీ వర్గాల సమాచారం. తమ బంధాన్ని కేవలం ప్రైవేట్‌గా ఉంచాలనే ఉద్దేశంతోనే వీరు సైలెంట్‌గా ఉంటున్నారట. తాజాగా రీతూ వర్మ తన లైఫ్‌లో ఒక కొత్త ప్రయాణం మొదలైందంటూ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌కు అందరికంటే ముందే వైష్ణవ్ తేజ్ లైక్ కొట్టడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ చిన్న లైక్‌తో వీరిద్దరి బంధంపై వస్తున్న ఫేక్ రూమర్స్‌కి చెక్ పడినట్లయింది. కెరీర్ లో సెట్ అయ్యాక.. రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. అందుకే తమ బంధం బయటపడకుండా సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తున్నారని చెప్పుకొస్తున్నారు.
ఇక కెరీర్ విషయానికొస్తే.. వరుస ప్లాప్‌ల తర్వాత వైష్ణవ్ తేజ్ దాదాపు రెండేళ్లుగా కొత్త ప్రాజెక్టు ఏదీ ఒప్పుకోకుండా తన కెరీర్‌ను తిరిగి ట్రాక్‌లోకి తెచ్చే పనిలో పడ్డాడు. మరోవైపు రీతూ వర్మ గోపీచంద్ సరసన నటించిన కొత్త సినిమా విడుదల కోసం సిద్ధమవుతోంది. మరి ఈ జంట ఎప్పుడు పెళ్లిపీటలు ఎక్కుతుందో.. చూడాలి.