Rishabh Sawhney: ఫైటర్ తర్వాత ‘నాగబంధం’తో పెద్ద గుర్తింపు
ABN , Publish Date - Jul 04 , 2026 | 05:07 PM
‘నాగబంధం’ చిత్రం నటుడిగా తనకెంతో గుర్తింపు తెచ్చిందని విలన్ పాత్రలో అబ్దాలీగా నటించిన రిషబ్ సాహ్నీ అన్నారు.
‘నాగబంధం’ చిత్రం నటుడిగా తనకెంతో గుర్తింపు తెచ్చిందని విలన్ పాత్రలో అబ్దాలీగా నటించిన రిషబ్ సాహ్నీ అన్నారు. తెరపై ఆ పాత్ర కనిపించిన ప్రతిసారీ థియేటర్‌లో ప్రత్యేకమైన ఇంపాక్ట్ కనిపించిందని ఆనందం వ్యక్తం చేశారు. అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాగబంధం’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో అబ్దాలీ పాత్రకు వచ్చిన స్పందన గురించి రిషబ్ సాహ్నీ మాట్లాడుతూ ‘సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నా పాత్ర బాడీ లాంగ్వేజ్, హావభావాలు అన్ని చక్కగా కుదిరాయని ప్రేక్షకులు అంటుంటే నోట మాటలు రావడం లేదు. ఓ నెటిజన్ ఆ పాత్ర చూస్తు కళ్లు తిప్పుకోలేకపోయానని అనడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. బాలీవుడ్‌లో వచ్చిన ‘ఫైటర్ తర్వాత మరోసారి ఇలాంటి గుర్తింపు దక్కింది. ఈ సక్సెస్‌ను ఎప్పటికీ మరచిపోలేను. అలాగే పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉందని, నటన, కమాండింగ్ స్ర్కీన్ ప్రెజెన్స్, మ్యాగ్నెటిక్ ఆరా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయన టీమ్ మొత్తం అంటుంటే ఓ నటుడికి ఇంతకన్నా ఇంకేం కావాలి. ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయే ఇలాంటి పాత్రలో ఎన్నో రావాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
Varanasi: క్రేజీ ఫొటో.. రాముడిగా మహేష్ బాబు లుక్ ఇదేనా
Bandla Ganesh: సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా.. న్యాయం సాధిస్తా..
ఒక్క సినిమా కోసం.. నాని రెండు చిత్రాలు వదిలేశాడా