జై హనుమాన్.. అమ్మ బాబోయ్ రిషబ్ అంత తీసుకుంటున్నాడా
ABN , Publish Date - May 03 , 2026 | 05:08 PM
చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయాన్ని అందుకుంది హనుమాన్ (Hanuman). తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ 2024 లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయాన్ని అందుకుంది హనుమాన్ (Hanuman). తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ 2024 లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఒక్క సినిమాతో తేజ సజ్జా పాన్ ఇండియా హీరో అయ్యారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారారు.
ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉందని మేకర్స్ ముందుగానే ప్రకటించారు. హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ రానుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తోన్నారు. తేజ సజ్జా కొద్దిసేపు మాత్రమే కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే జై హనుమాన్ నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
కాంతార తరువాత రిషబ్ శెట్టి రేంజ్ మారిపోయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జై హనుమాన్ కి రిషబ్ అత్యధిక పారితోషికం అందుకుంటున్నారట. ఇంచుమించు రూ. 80 కోట్ల వరకు రిషబ్ కు ముట్టజెప్పారట మేకర్స్. ఇది తక్కువ అమౌంట్ అయితే కాదు. కన్నడ నుంచి తెలుగుకు వచ్చి సినిమాలు చేస్తూ అంత రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోగా రిషబ్ పేరు మారుమ్రోగిపోతోంది. ఇక ఈ విషయం విన్న నెటిజన్స్ .. అమ్మబాబోయ్ఈ.. రిషబ్ అంత తీసుకుంటున్నారా అని నోళ్ళు వెళ్లబెడుతున్నారు. అయితే ఈ వార్తలో నిజమెంత అనేది తెలియదు కానీ, ఇదే నిజమైతే మాత్రం రిషబ్ శెట్టిని ఆపడం కష్టమే అని అంటున్నారు.