కూతురితో.. రేణూ దేశాయ్ దీపావ‌ళి సంబురాలు

ABN , Publish Date - Nov 08 , 2026 | 10:17 PM

నటి రేణూ దేశాయ్ ఈ ఏడాది దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకున్నారు.

Renu Desai

నటి రేణూ దేశాయ్ (Renu Desai) ఈ ఏడాది దీపావళి (Diwali) పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. తన తల్లి, సోదరి ఆద్యా దేశాయ్‌తో కలిసి పండుగ సంబరాల్లో (Diwali Celebrations) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబంతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. "అమ్మ, నా చెల్లి ఆద్యా వల్ల ఈసారి నా దీపావళి మరింత ప్రత్యేకంగా మారింది" అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Renu Desai

అయితే ఈ ఫొటోల్లో రేణూ దేశాయ్ ధరించిన చంద్రకోర బొట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ బొట్టు వెనుక ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కూడా ఆమె వివరించారు. తాను పుట్టిన సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తుగా చంద్రకోరను ధరిస్తానని తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ (Shivaji Maharaj) తో పాటు మరాఠా సామ్రాజ్యంలోని ప్రజలు కూడా స్వరాజ్యం, గౌరవం, ధర్మానికి ప్రతీకగా దీనిని ధరించేవారని పేర్కొన్నారు. చంద్రవంక ఆకారంలో ఉండే ఈ బొట్టు మరాఠా ప్రజల ఆత్మగౌరవం, గుర్తింపు, పోరాట స్ఫూర్తికి చిహ్నంగా నిలిచిందని వివరించారు.

Renu Desai

చంద్రకోరకు తన దృష్టిలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కూడా ఉందని రేణూ దేశాయ్ చెప్పారు. ఆధ్యాత్మికంగా చంద్రవంక ఆకారం తురీయ స్థితిని సూచిస్తుందని వివరించారు. అలాగే చంద్రుని ప్రశాంతమైన శక్తి, శివతత్వం, అంతరంగ ప్రశాంతతకు కూడా ఇది ప్రతీకగా భావిస్తానని తెలిపారు. చివరగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ తన సందేశాన్ని ముగించారు.

Updated Date - Nov 08 , 2026 | 10:17 PM