Renu Desai: పవన్ కళ్యాణ్ అందుకే వదిలేశాడు.. నాకు తిక్క ఉంది
ABN , Publish Date - Jan 19 , 2026 | 07:03 PM
నటి రేణు దేశాయ్ (Renu Desai).. డాగ్స్ సంరక్షణ కోసం పెట్టిన ప్రెస్ మీట్ లో గందరగోళం జరిగిన విషయం తెల్సిందే. ఆమె.. జర్నలిస్ట్ పై విరుచుకుపడింది. బుద్ధి ఉందా లేదా అంటూ మండిపడింది.
Renu Desai: నటి రేణు దేశాయ్ (Renu Desai).. డాగ్స్ సంరక్షణ కోసం పెట్టిన ప్రెస్ మీట్ లో గందరగోళం జరిగిన విషయం తెల్సిందే. ఆమె.. జర్నలిస్ట్ పై విరుచుకుపడింది. బుద్ధి ఉందా లేదా అంటూ మండిపడింది. దీంతో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ .. రేణును తప్పు పడుతూ థంబ్ నెయిల్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా రేణు పర్సనల్ విషయాలను తోడుతూ కామెంట్స్ పెట్టడం జరిగింది. తాజాగా ప్రెస్ మీట్ లో జరిగిన గొడవపై ఆమె క్లారిటీ ఇచ్చింది. తాను మీడియా మీద కోప్పడలేదని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఇలా ఫైర్ అవ్వడంతో ఆమె రాజకీయాల్లోకి వస్తుంది అని, అందుకే ప్రభుత్వాల గురించి కూడా మాట్లాడిందని కామెంట్స్ రావడంతో దానిపై కూడా క్లారిటీ ఇచ్చింది.
' నేను మీ అందరికీ ఒకటి క్లియర్ చేస్తున్నారు. నేను రాజకీయాల్లోకి రావడం లేదు. ఇలాంటి పుకార్లను ఆపండి. నేను ఏ పార్టీలో చేరడం లేదు. నాకు అస్సలు పాలిటిక్స్ ఇష్టం లేదు. నా NGO తో , నేను చేసే సోషల్ సర్వీస్ తో చాలా హ్యాపీ గా ఉన్నాను. ఇక ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో నేను మీడియా పర్సన్ పై అరవలేదు. తప్పు థంబ్ నెయిల్స్ రాస్తున్నారు. ప్రెస్ కాన్ఫిరెన్స్ లో ఎవరో తెలియని 55 ఏళ్ల వ్యక్తి నేను మాట్లాడుతుంటే సడెన్ గా వచ్చి అరిచాడు. అతను నన్ను కొట్టడానికి కూడా రాబోయాడు. మిగతావాళ్ళు ఆపారు. అందుకే అతనిపై నేను కోప్పడ్డాను. నేనెప్పుడూ ప్రెస్ మీద అరవలేదు. నాకు చాలా గౌరవం ఉంది మీడియా మీద. దయచేసి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి.
ఇక చాలామంది నా పర్సనల్ లైఫ్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. అది ఎంతవరకు పద్దతి. అందుకే పవన్ కళ్యాణ్ వదిలేశాడు. నాకు తిక్క ఉంది. ఇలా పోరాటం చేయడం వలన నాకేమైనా డబ్బు వస్తుందా.. ? నేను కుక్కలా కోసం పోరాటం చేయడం లేదు. నేను మనుషుల జీవితాల కోసం ఫైట్ చేస్తున్నాను. నేను మనుషుల కోసం పోరాటం చేస్తే ఇంత నీచంగా చూస్తారా.. ? మీ పిల్లలకు కుక్క కరిచి చనిపోతే మీకు ఆ బాధ తెలుస్తుంది అని అంటున్నారు. నా బిడ్డల ప్రాణం జోలికి ఎందుకు వస్తున్నారు. ఎవరి బిడ్డ ప్రాణం పోయినా అది తప్పు. ఎక్కడైనా పిచ్చి కుక్క ఉంటే.. నా NGO కి, GHMC కి కాల్ చేయండి. నేనొచ్చి తీసుకెళ్తాను. అంతే. అంతేకాని నా పిల్లల మీద, నా మీద ఇలాంటి మాటలు వద్దు' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రేణు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.