పవర్ఫుల్ అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ప్రభాస్..
ABN , Publish Date - Nov 17 , 2026 | 06:03 PM
పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ చాలా తక్కువగా బయట కనిపిస్తాడు. ఇక ఆలయాలు, పూజలు అంటే చాలా అంటే చాలా రేర్ అని చెప్పాలి.
పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ చాలా తక్కువగా బయట కనిపిస్తాడు. ఇక ఆలయాలు, పూజలు అంటే చాలా అంటే చాలా రేర్ అని చెప్పాలి. అయితే సడెన్ గా డార్లింగ్ కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు నగరానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత శక్తివంతమైన కటీల్ శ్రీ దుర్గాపరమేశ్వరి ఆలయాన్ని (Kateel Sri Durgaparameshwari Temple) ని సందర్శించాడు. అమ్మవారికి ప్రభాస్ ప్రత్యేక పూజలు నిర్వహించాడు. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటుంది.
కర్ణాటక తీర ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కటీల్ అమ్మవారి ఆలయం అత్యంత పవర్ఫుల్ పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. మంగళూరుకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో కొలువై ఉన్న ఈ ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. సినీ ప్రముఖులు సైతం తమ సినిమాల విజయం కోసం, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ముందు లేదా భారీ బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న తర్వాత మొక్కులు చెల్లించుకోవడానికి ఈ పవిత్ర క్షేత్రానికి విచ్చేస్తుంటారు. ప్రభాస్ సైతం ఇక్కడి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.
సాధారణంగా పబ్లిక్ ఈవెంట్స్ లేదా బయట ఎక్కువగా కనిపించని ప్రభాస్, సంప్రదాయ దుస్తుల్లో ఎంతో నిరాడంబరంగా ఆలయానికి విచ్చేసిన దృశ్యాలు డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే సడెన్ గా డార్లింగ్ ఈ పూజలు నిర్వహించడానికి కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం వరుస పాన్-ఇండియా చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటకు ప్రభాస్ సిద్దమవుతున్నాడు. ఇప్పటికే ఆయన చేతిలో అరడజన్ సినిమాలకు పైగా ఉన్నాయి. ఫౌజీ, కల్కి 2, స్పిరిట్.. సెట్స్ మీద ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. మరి ఈ సినిమాలతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.