ఖాకీ దుస్తులు ధరించిన అందాల ముద్దుగుమ్మ...

ABN , Publish Date - Feb 07 , 2026 | 06:42 PM

శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటిస్తున్న 'మృత్యుంజయ్' చిత్రం ఫిబ్రవరి 27న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మోనికా ఐపీఎస్ అధికారి సీతా పరశురామ్ గా నటిస్తోంది.

Reba Monica John

శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ ‘మృత్యుంజయ్’ (Mrityunjay). ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కు హుస్సేన్ షా కిరణ్ డైరెక్ట్ చేస్తున్నారు. 'సామజవరగమన' తర్వాత శ్రీవిష్ణు (Srivishnu), రెబా మోనికా జాన్ (Reba Monica John) జంటగా నటిస్తున్న సినిమా ఇది. రమ్య గుణ్ణం సమర్పణలో సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌నివారం మేక‌ర్స్ ఈ సినిమాలో రెబా మోనికా జాన్ పోషిస్తున్న ఐపీఎస్ సీతా ప‌రశురామ్ పాత్రకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్టర్ ను విడుద‌ల చేశారు. ఇది సినిమాపై మ‌రింత క్యూరియాసిటీని పెంచేలా క‌నిపిస్తోంది.


'అందం, అభిన‌యంతో 'సామజవరగమన' చిత్రంలో కుర్రకారు హృద‌యాల‌ను దోచుకున్న ముద్దుగుమ్మ రెబా జాన్ 'మృత్యుంజ‌య్' చిత్రంలో ఆస‌క్తిక‌ర‌మైన పాత్రలో కనిపించబోతోందని, ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి స్పందన లభిస్తోంద'ని మేకర్స్ తెలిపారు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో రెబా మోనికా జాన్ తనదైన నటనతో ఆకట్టుకోబోతోందని, డిఫ‌రెంట్ ప్రమోషన్స్, ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంద'ని మేకర్స్ చెప్పారు. ఈ చిత్రం ఫిబ్రవరి 27న‌ థియేటర్లలో సందడి చేయబోతోంది. కాలభైరవ (Kalabhairava) సంగీతం అందిస్తున్న 'మృత్యుంజయ్' చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర ప్రసాద్ ఎడిటర్.

Updated Date - Feb 07 , 2026 | 06:43 PM