Student: రియల్ స్టార్ శ్రీహరి తనయుడు అదరగొట్టాడుగా.. 'స్టూడెంట్' మూవీ టీజర్
ABN , Publish Date - Jun 29 , 2026 | 06:47 AM
దివంగత రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా తెరకెక్కిన చిత్రం 'స్టూడెంట్'.
దివంగత రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి (Megamsh Srihari) హీరోగా తెరకెక్కిన చిత్రం 'స్టూడెంట్'. విజేత పరీఖ్ (Vijeta Parikh) హీరోయిన్. జోవికా సినిమాస్, చెరిష్ మీడియా వర్క్స్ బ్యానర్స్ పై బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. గతంలో కిరణ్ అబ్బవరంతో 'సెబాస్టియన్ పి.సి. 524' మూవీని తెరకెక్కించిన బాలాజీ సయ్యపురెడ్డి.. బాలు తత్త్వమసి (Balu Tatvamasi) పేరుతో ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.
అయితే.. సుమారు మూడేండ్ల క్రితం ప్రారంభమైన ఈ చిత్రం ఎట్టకులకు విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ టీజర్ విడుదల చేశారు.టీజర్‌ను చూస్తే సినిమాను కాలేజ్ నేపథ్యంలో రాజకీయాల నేపథ్యంలో మూవీని తెరకెక్కించినట్లు స్ఫస్టంగా అర్ధమవుతోంది.