వాళ్ళు ఒళ్ళు బలిసి సినిమాలు చేస్తున్నారు..

ABN , Publish Date - May 01 , 2026 | 02:37 PM

నట దర్శకుడు రవిబాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడు చలపతి రావు వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమై.. అల్లరి సినిమాతో డైరెక్టర్ గా మారారు.

Ravi Babu

నట దర్శకుడు రవిబాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడు చలపతి రావు వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమై.. అల్లరి సినిమాతో డైరెక్టర్ గా మారారు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రవిబాబు.. ఒకపక్క నటిస్తూనే ఇంకోపక్క దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఆయన నటించి, దర్శకత్వం వహించిన చిత్రం రేజర్. మే 8 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రచారాలు మొదలుపెట్టిన రవిబాబు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన విషయాలనే కాకుండా ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు.


రవిబాబు చాలా ముక్కుసూటి మనిషి. ఏది మనసులో దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ జనరేషన్ లో సినిమాలు ఎలా తీస్తున్నారు.. అప్పట్లో సినిమాలు ఎలా ఉండేవి అనేది చెప్పుకొచ్చారు. 'అప్పుడు సినిమాలు తీసేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసేవాళ్ళు.. ఇప్పుడు సినిమాలు తీసేవాళ్ళు ఒళ్ళు బలిసి చేస్తున్నారు. ఎందుకంటే ఫిల్మ్ పై వారికున్న గౌరవం అలాంటిది. అప్పుడు ఫిల్మ్ కాస్ట్ చాలా ఖరీదైనది. ఆ విషయం వాళ్ళకు తెలుసు. అందుకే డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, కెమెరా మ్యాన్స్ కానీ చాలా జాగ్రత్తగా ఎవరి పని వాళ్ళు చేసుకొనేవారు.


ఇప్పుడు అంతా డిజిటల్. చిప్ తీయడం.. తిరిగి మళ్ళీ పెట్టడం.. అంతే. ఆ చిప్ కాస్ట్ ఎంతో కూడా వారికి తెలియదు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడెవరికి ఇన్ పుట్ టెక్నాలజీ మీద గౌరవం లేకపోవడం. టైమ్ మీద గౌరవం లేకపోవడం. అప్పుడేంటంటే టైమ్ కి, డబ్బులకు విలువనిచ్చేవాళ్ళు. ఇప్పుడది లేదు. ప్రొడక్షన్ ప్లాన్ కూడా అప్పుడు ఉండేది. ఇప్పుడు అంత క్రమశిక్షణ లేదు' అని తెలిపారు.

Updated Date - May 01 , 2026 | 02:59 PM