షాకింగ్.. మైసా వాయిదా

ABN , Publish Date - Nov 21 , 2026 | 07:22 PM

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో రవీంద్ర పూలే దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మైసా (Mysaa). ఇక ఈ సినిమాని అజయ్ సయ్యపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

Mysaa

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో రవీంద్ర పూలే దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మైసా (Mysaa). ఇక ఈ సినిమాని అజయ్ సయ్యపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలని పెంచేశాయి. ముఖ్యంగా శుక్రవారం రిలీజ్ చేసిన ఒసేయ్ రాములమ్మ సాంగ్ రీమిక్స్ అమాంతం హైప్ పెరిగేలా చేసింది. మొదటి నుంచి ఈ సినిమా నవంబర్ 27 న రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. ఇంకోపక్క రష్మిక సైతం రిలీజ్డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది.


అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మైసా రిలీజ్ వాయిదా పడినట్లు టాక్ నడుస్తోంది. నవంబర్ 26 న ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎలక్షన్స్ జరుగుతోన్న విషయం తెల్సిందే. తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజానీకం ఎన్నికల కోసం తమ సొంతఊళ్లకు వెళ్లనున్నారు. ఈ సమయంలో మైసా రిలీజ్ చేస్తే కలక్షన్స్ తగ్గే అవకాశం ఉందని భావించిన మేకర్స్ ఈ సినిమాని వాయిదా వేసినట్లు సమాచారం. ఇదే విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట. త్వరలోనే మరో కొత్త డేట్ ని వెతికి మైసాని రిలీజ్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది.


పుష్ప 2, ఛావా వంటి బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత రష్మిక మందన్న పూర్తిస్థాయి యాక్షన్ అవతార్‌లో కనిపించబోతున్న సినిమా కావడంతో మైసాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంది. ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అయినా కూడా ప్రేక్షకులు హిట్ చేస్తారు అనే నమ్మకంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరిఈసారి మైసా ఏ డేట్ కి వస్తుందో చూడాలి.

Updated Date - Nov 21 , 2026 | 07:41 PM