మైసా.. ఓ.. ఒసేయ్ రాములమ్మా
ABN , Publish Date - Nov 20 , 2026 | 07:41 PM
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ మైసా (MYSAA). రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్ సైపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప నిర్మిస్తున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ మైసా (MYSAA). రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్ సైపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ మరో సాంగ్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ పాట ప్రేక్షకులకు చాలా స్పెషల్. ఎందుకంటే.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించిన ఒసేయ్ .. రాములమ్మ చిత్రంలోని ఓ.. ఒసేయ్ రాములమ్మ సాంగ్ ని రష్మిక కోసం రీమిక్స్ చేశారు.
ఈ వీడియో సాంగ్‌లో రష్మిక మందన్న ఇప్పటివరకు ఎన్నడూ చూడని అత్యంత ఉగ్రమైన, మాస్ అండ్ వైలెంట్ అవతార్‌లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. అడవి నేపథ్యంలో, రక్తసిక్తమైన పోరాట సన్నివేశాలు, గొలుసులు, ఆయుధాలతో రష్మిక చేసే ఫైట్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. మంటలు, నీటిలో సాగే యాక్షన్ సీక్వెన్స్‌లు పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. సాధారణ అమ్మాయిగా మొదలై, ఉగ్రరూపం దాల్చే క్యారెక్టర్‌గా రష్మిక స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది.
ఇక ఈ పాటకు డాక్టర్ సుద్దాల అశోక్ తేజ రాసిన సాహిత్యం, వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన పవర్ఫుల్ గాత్రం పాటకు ప్రాణం పోశాయి. జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం, డ్రమ్స్, హై-ఎనర్జీ బీట్స్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. స్టూడియోలో వందేమాతరం శ్రీనివాస్ పాడుతున్న దృశ్యాలు, షూటింగ్ మేకింగ్ బిట్స్ కూడా ఈ వీడియోలో ఆకట్టుకుంటున్నాయి. నవంబర్ 27న థియేటర్లలోకి రాబోతున్న మైసా చిత్రంపై ఒసేయ్ రాములమ్మా సాంగ్ భారీ హైప్ క్రియేట్ చేసింది. రష్మిక కెరీర్లోనే ఇది ఒక డిఫరెంట్, హై-వోల్టేజ్ మాస్ ప్రాజెక్ట్‌గా నిలవడం ఖాయమని ఈ వీడియో సాంగ్ స్పష్టం చేస్తోంది. మరి ఈ సినిమాతో రష్మిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.