Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక ఏమందంటే
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:31 PM
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna).. ఈ ఇద్దరి జోడీ వెండితెరపై ఎంతటి మ్యాజిక్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే.
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ(vijay Devarakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna).. ఈ ఇద్దరి జోడీ వెండితెరపై ఎంతటి మ్యాజిక్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, నిజ జీవితంలోనూ కొనసాగుతోందని గత కొంతకాలంగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా విజయ్, రష్మిక గాఢమైన ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీరు కలిసి వెకేషన్లకు వెళ్లడం, ఒకే రకమైన ప్రదేశాల నుంచి ఫోటోలు షేర్ చేయడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి.
ఇక ఈ లవ్ బడ్స్ గత ఏడాది సన్నిహితుల సమక్షంలో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు రావడంతో అప్పటి నుంచే వీరి పెళ్లి ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనుందనే ప్రచారం బలంగా సాగుతోంది. అయితే, ఈ విషయంపై ఇద్దరూ ఇప్పటివరకు మౌనం పాటిస్తుండగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక స్పందించింది. 'ఈ రూమర్స్ మొదలై నాలుగేళ్లు అవుతోంది. అప్పటి నుంచి అందరూ అదే ప్రశ్న అడుగుతున్నారు. కానీ నిజం ఏమిటంటే, మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రమే మేము మాట్లాడతాం' అని ఆమె స్పష్టం చేసింది. సరైన సమయం వచ్చినప్పుడే తాము ఈ విషయాన్ని వెల్లడిస్తామని ఆమె చెప్పింది. ఏది ఏమైనా, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటపై ఉన్న క్రేజ్ దృష్ట్యా వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అటు విజయ్, ఇటు రష్మిక ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన'తో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. మరోవైపు రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'మైసా'. ఈ సినిమాతో రవీంద్ర పుల్లె దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్‌ఫార్ములా ఫిలిమ్స్ పతాకంపై అజయ్ అలాగే అనిల్ సయ్యపురెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.