Rashmika Mandanna: అవకాశాలను.. అసలు వదులుకోను
ABN , Publish Date - Oct 23 , 2026 | 08:24 AM
నేను అవరోధాలను దాటడానికే ప్రయత్నిస్తాను తప్ప, అవకాశాలను వదులుకోను' అని నటి రష్మిక మందన్న అన్నారు.
'ఎవరో ఏదో అన్నారని పట్టించుకుంటూ కూర్చుంటే ఎలా? ట్రోలింగ్స్‌ను, విమర్శలను మనసుకు తీసుకుని కుంగిపోతే కెరీర్ కుంటు పడుతుంది. అభివృద్ధికి అడ్డుకట్ట వేసుకున్నట్టవుతుంది. నేను అవరోధాలను దాటడానికే ప్రయత్నిస్తాను తప్ప, అవకాశాలను వదులుకోను' అని నటి రష్మిక మందన్న (Rashmika Mandanna) అన్నారు.
పెళ్లి తర్వాత తన భర్త విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో కలిసి నటించిన రణబాలి (Ranabaali) చిత్రం దసరాకు థియేటర్లకు వచ్చి మంచి కలెక్షన్లు రాబడుతూ సూపర్ హిట్ వైపు పరుగులు పెడుతోంది. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఈ చిత్రం ఇతర రాష్ట్రాలలో, పలు భాషల్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ప్రమోషన్లలో భాగంగా ఉత్తరాదిన పర్యటిస్తున్న రష్మిక మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
'నేను దక్షిణాది అమ్మాయిని కాబట్టి, నేను మాట్లాడే హిందీలో ఓ రకమైన యాస ఉంటుంది. దాని గురించి చాలా సార్లు ట్రోల్ చేశారు. నా నటన, భాష, యాస, స్టైల్.. ఇలా ఏదో ఒక విషయం మీద విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాను. అయినా వాటిని చెవికి ఎక్కించుకోను. నా దర్శకులు ఎప్పుడూ నాతోనే డబ్బింగ్ చెప్పించడానికి మొగ్గు చూపుతారు. వాళ్లకు ఇబ్బంది లేకపోతే ఎవరితోనైనా డబ్బింగ్ చెప్పించుకోమని నేను చాలా సార్లు అన్నాను. కానీ, భాష ఏదైనా మైకు ముందు నన్నే నిలబెట్టి భావోద్వేగాలు పలికించమంటుంటే ఆనందంగా ఉంది. నా పనిని పర్పెక్ట్ గా చేస్తున్నాననే సంతృప్తి ఉంది' అని అన్నారు.