Rashmika Mandanna: అలా చేయడానికి నేనేమీ హీరోని కాదు..
ABN , Publish Date - Jan 19 , 2026 | 07:02 PM
రష్మిక (Rashmika Mandanna) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నా కథానాయిక. సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.
రష్మిక (Rashmika Mandanna) ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నా కథానాయిక. సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. గతేడాది ఐదు చిత్రాలతో అలరించిన ఆమె ప్రస్త్తుతం మైసా(mysaa), కాక్‌టైల్ 2 చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర జవాబులిచ్చారు. రెమ్యునరేషన్ గురించి వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ నేనే అని చాలామంది అనుకుంటారు. అందులో ఏమాత్రం నిజం లేదు. భారీ మొత్తంలో పారితోషికం తీసుకోవడానికి నేనేమీ హీరోని కాదు. అయితే అలాంటి వార్తలు వచ్చినప్పుడల్లా అది నిజం అయితే బాగుండు అనుకుంటా. ప్రత్యేక గీతాల్లో నటించడానికి నేను సిద్ధంగానే ఉన్నా. అయితే ఆ సినిమాలో నేనే హీరోయిన్‌గా ఉండాలి. లేదంటే ఇండస్ట్రీలో ముగ్గురు దర్శకులున్నారు. వాళ్లు అడిగితే కచ్చితంగా లీడ్ క్యారెక్టర్ కాకపోయినా స్పెషల్‌ల సాంగ్ చేస్తాను’ అన్నారు.
ఇంకా రష్మిక మాట్లాడుతూ.. ‘నా కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి దాకా ఒకేలా పని చేసుకుంటూ వస్తున్నా. భాషా పరమైన హద్దులు పెట్టుకోకుండా వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ సినిమాలు చేస్తున్నా. ఇకపై కూడా నా పద్దతి, ప్లానింగ్ అలాగే ఉంటుంది. అన్ని రకాల పాత్రలు చేయాలన్నదే నా కోరిక. ఒక్కో ఆడియన్‌కి ఒక్కో అభిరుచి ఉంటుంది. వారికి నచ్చిన సినిమాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. అందుకే మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలు, కమర్షియల్, ప్రేమకథలు ఇలా అన్ని రకాల సినిమాలు చేస్తున్నాను’
అలాగే తనపై వచ్చిన రూమర్స్ గురించి కూడా రష్మిక స్పందించారు. ‘వ్యూస్‌తో డబ్బు రాబట్టుకోవడం కోసం నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తూ కొందరు మాలాంటి వారిపై ఏవేవో రాస్తుంటారు. నిజంగానే వాళ్లకు నాపై కోపం ఉండొచ్చు. దాంతో ఇంకాస్త మసాల దట్టించి గాసిప్పులు క్రియేట్ చేస్తుంటారు. ఒకరకంగా చెప్పాలంటే అలాంటి వార్తలు కూడా ఎంతోమందిని పోషిస్తున్నాయి. మన పేరు చెప్పి బతుకుతున్నారని పట్టించుకోను. ఇండస్ట్రీలో ఉన్నవారికి ఇలాంటివన్నీ కామన్. కానీ నిజం అనేది ఒకటుంటుంది. అది ఏదో ఒక రోజు బయటకు వస్తుందని అనుకుంటాను. కొన్ని నిజాలు బయటకు వచ్చినా ఇలాంటి వారు .మారడం లేదు. ఒకప్పుడు రూమర్స్ వస్తే ఎంతో బాధపడేదాన్ని. ఇప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నా’ అని అన్నారు. 