Rashmika Mandanna: పెళ్లి తర్వాత 3 నెలలు దూరంగా ఉన్నాం

ABN , Publish Date - Sep 04 , 2026 | 04:05 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) - రష్మిక మందన్నా(Rashmika Mandanna) వివాహబంధం తర్వాత వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర వివరాలు నిరంతరం వార్తల్లో నిలుస్తున్నాయి.

Rashmika Mandanna

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) - రష్మిక మందన్నా(Rashmika Mandanna) వివాహబంధం తర్వాత వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర వివరాలు నిరంతరం వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ జంట ఎక్కడ కనిపించినా సోషల్ మీడియా షేక్ అవుతోంది. రష్మిక కనిపిస్తే.. అన్న ఎక్కడ అని.. విజయ కనిపిస్తే వదిన ఎలా ఉంది అని ఫ్యాన్స్ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఇక ఈమధ్యనే రష్మిక.. తనకు గాయం అవ్వడం వలన ఇంట్లో రెస్ట్ తీసుకొంటుంది. తాజాగా ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ గాయం వలన విజయ్, తాను ఎంతో క్వాలిటీ సమయాన్ని గడిపినట్లు తెలిపింది.


మైసా చిత్ర షూటింగ్ సమయంలో తనకు తగిలిన గాయం వల్ల లభించిన విశ్రాంతి సమయం, పెళ్లి తర్వాత తమ ఇద్దరి బంధాన్ని మరింత బలపరచుకోవడానికి ఒక ఊహించని వరంగా మారిందని చెప్పుకొచ్చింది. ఫిబ్రవరిలో వివాహం జరిగిన తర్వాత ఇద్దరి వరుస షూటింగ్‌లు, బిజీ షెడ్యూల్స్ వల్ల దాదాపు మూడు నెలల పాటు కలుసుకోలేకపోయామని రష్మిక గుర్తు చేసుచేసుకుంది. 'షూటింగ్ కాంప్లికేషన్ వల్ల కంటిన్యూగా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మొదట బాధపడ్డాను. కానీ ఆ రికవరీ పీరియడ్‌లోనే విజయ్ నాకు ప్రతి అడుగులోనూ ఎంతో ఆప్యాయంగా అండగా నిలిచాడు. విజయ్ సంరక్షణలో గడిపిన ఆ రోజులు నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనవి' అని ఆనందం వ్యక్తం చేసింది.


ఇక ఈ విరామ సమయంలో ఇద్దరూ కలిసి ఇంట్లోనే కొరియన్-డ్రామాలు చూస్తూ క్వాలిటీ టైమ్ గడిపామని, భవిష్యత్తులో కూడా మనం ఇలాంటి మంచి బ్రేక్స్ తీసుకుందాం.. కాకపోతే ఇలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తపడదాం అని విజయ్ సరదాగా జోక్ చేసినట్లు రష్మిక నవ్వుతూ వెల్లడించింది. ప్రస్తుతం రష్మిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకు తగిలిన గాయం రష్మికకు వరంగా మారిందని ఆమె చెప్పడంతో ఫ్యాన్స్ ఇలాంటి గాయాలు లేకుండా సంతోషంగా ఉండాలని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - Sep 04 , 2026 | 04:05 PM