అలా పెళ్లైంది.. ఇలా అవార్డు వచ్చింది

ABN , Publish Date - Mar 07 , 2026 | 06:41 PM

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ (Telengana Gaddar Awards) ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ ఏడాది ప్రకటించిన అవార్డ్స్ లో ఉత్తమ నటిగా ద గర్ల్ ఫ్రెండ్ (The Girlfriend) నాయిక రశ్మిక మందన్న (Rashmika Mandanna) ఎంపికయ్యారు.

Rashmika Mandanna

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ (Telengana Gaddar Awards) ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ ఏడాది ప్రకటించిన అవార్డ్స్ లో ఉత్తమ నటిగా ద గర్ల్ ఫ్రెండ్ (The Girlfriend) నాయిక రశ్మిక మందన్న (Rashmika Mandanna) ఎంపికయ్యారు. గతేడాది ఈ సినిమా రిలీజ్ అయ్యింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రశ్మిక నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. భూమా దేవి పాత్రలో ఆమె ఒదిగిపోయారు. ఇక తనకు ఉత్తమనటి అవార్డు రావడంతో ఆమె తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

'గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ద గర్ల్ ఫ్రెండ్ సినిమాకి ఉత్తమనటి అవార్డు అందుకోవడం నిజంగా కృతజ్ఞతగా మరియు సంతోషంగా ఉంది. భూమా దేవి నా హృదయానికి చాలా దగ్గరగా ఉంది. రాహుల్ రవీంద్రన్, గీతా ఆర్ట్స్ , ధీరజ్ మొగిలినేని, విద్యా అక్క.. ది గర్ల్ ఫ్రెండ్ టీమ్ మొత్తానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను. నాకు ఈ అవార్డు ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. విన్నర్స్ అందరికీ శుభాకాంక్షలు' అంటూ ట్విట్టర్ లో తన ఆనందాన్ని పంచుకున్నారు.

ఇక ఈ మధ్యనే రశ్మిక మందన్నా.. విజయ్ దేవరకొండ వివాహం ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. రశ్మిక పెళ్ళి తరువాత వచ్చిన మొదటి అవార్డు కావడంతో అభిమానులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రశ్మిక వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి ఈ సినిమాలతో ఆమె ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.

Updated Date - Mar 07 , 2026 | 07:01 PM