Rashmika Mandanna: టీమ్‌తో కలసి.. నేను ఎపిక్ సినిమా చూస్తాను
ABN , Publish Date - Sep 05 , 2026 | 06:53 AM
‘ఎపిక్’ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న.
‘ఎపిక్’ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna). ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా ఆదిత్య హాసన్ (Adithya Haasan) తెరకెక్కించిన చిత్రం ‘ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్’ (Epic). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సినిమా ఈనెల 11న విడుదలవుతున్న సందర్భంగా శుక్రవారం ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రష్మిక మాట్లాడుతూ ‘ ట్రైలర్ నాకు బాగా నచ్చింది. మంచి రోమ్‌కామ్ కె డ్రామా వైబ్ కనిపిస్తోంది. ఆనంద్ ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటాడు. సినిమా కోసమే కష్టపడుతుంటాడు. ఈ చిత్రంలో కడలి పాత్ర గొప్పగా ఉంటుందని చెప్పారు. వైష్ణవికి గొప్ప పేరు వస్తుంది. ఆదిత్యను చూస్తే గర్వంగా అనిపిస్తుంటుంది. హేషమ్ గారి మ్యూజిక్ ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. ఈనెల 11న ‘ఎపిక్’ రాబోతోంది. 10న ప్రీమియర్లు వేస్తున్నారు. టీమ్‌తో కలసి నేను సినిమా చూస్తాను’ అని అన్నారు.
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ‘ఎప్పుడూ సపోర్ట్‌గా నిలిచే వదినమ్మ దొరకడం నా అదృష్టం. ఈ చిత్రానికి ‘ఎపిక్’ అనే టైటిల్ పెట్టడానికి కారణముంది. మన జీవితంలో ఎన్నో ఎపిక్ మూమెంట్స్ ఉంటాయి. ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నా. ఇదొక ఎమోషనల్ సినిమా. మనల్ని మనం తెరపై చూసుకున్నట్టుగా ఉంటుంది’ అని అన్నారు.
వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ‘సితార బ్యానర్‌లో నేను సినిమాలు చేస్తూనే వస్తున్నాను. ఇప్పుడు ‘ఎపిక్’ చేయడం ఆనందంగా ఉంది. కడలి పాత్రలో నన్ను చూసి, నాకు అవకాశం ఇచ్చినందుకు ఆదిత్య గారికి కృతజ్ఞతలు. అజీమ్‌గారు ప్రతీ ఫ్రేమ్‌ని అందంగా మలిచారు’ అని అన్నారు. ఆదిత్య హాసన్ మాట్లాడుతూ ‘అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఆనంద్, వైష్ణవి, శివాజీగారు, వాసుకీ గారు అద్భుతంగా నటించారు. హేషమ్ సంగీతం అందరినీ ఆకట్టుకుంటుంది’ అని చెప్పారు. నటుడు శివాజీ, దర్శకులు శివ నిర్వాణ, శైలేష్ కొలను, కల్యాణ్ శంకర్, వినోద్ అనంతోజు, సాయి మార్తాండ్ తదితరులు పాల్గొన్నారు.