షాకింగ్.. రష్మికకు ప్రమాదం
ABN , Publish Date - Jul 31 , 2026 | 06:03 PM
నేషనల్ క్రష్, పాన్-ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) షూటింగ్‌లో తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె రణబాలి, మైసా వంటి భారీ చిత్రాల షూటింగ్‌లలో వరుసగా పాల్గొంటున్న విషయం తెలిసిందే.
నేషనల్ క్రష్, పాన్-ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) షూటింగ్‌లో తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె రణబాలి, మైసా వంటి భారీ చిత్రాల షూటింగ్‌లలో వరుసగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలకు సంబంధించిన కఠినమైన యాక్షన్ సీక్వెన్సులు, విపరీతమైన డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్‌లు చేయడం వల్ల ఆమె హిప్ ఏరియాలో టెండన్ డిటాచ్‌మెంట్ జరిగినట్లు సమాచారం. ఇటీవల ఓ డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో ఈ ప్రమాదం జరగగా, ఆమె తీవ్రమైన గాయానికి గురైనట్లు తెలుస్తోంది.
రష్మికకి అయిన ఈ గాయం వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేసిందట. సాధారణంగా అత్యంత తీవ్రంగా సాధన చేసే క్రీడాకారుల్లో మాత్రమే ఇలాంటి క్లిష్టమైన గాయాలు కనిపిస్తాయని, ఈ పరిస్థితి నుంచి కోలుకోవడానికి రష్మిక కనీసం 6 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, టెండన్ మళ్లీ బలపడేందుకు ప్రత్యేక రీహాబిలిటేషన్ చికిత్స కూడా అవసరమని వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం రష్మిక మందన్న చేతిలో 4 భారీ పాన్-ఇండియా చిత్రాలతో పాటు దాదాపు 30 ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. ఆమెకు ఈ తీవ్ర గాయం కావడంతో ఆయా సినిమాల షూటింగ్‌లు, అడ్వర్టైజ్‌మెంట్ చిత్రీకరణలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ఈ విషయం తెలియడంతో రష్మిక మందన్న త్వరగా కోలుకుని, మళ్లీ మునుపటి జోరుతో షూటింగ్ సెట్స్‌లోకి అడుగుపెట్టాలని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.