Rashmi: ట్రోలింగ్.. తిట్లు నాకేమీ కొత్త కాదు..
ABN , Publish Date - May 02 , 2026 | 04:32 PM
యాంకర్ రష్మీ (Rashmi) తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలతో మరోసారి ట్రోల్ అయ్యారు.
యాంకర్ రష్మీ (Rashmi) తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలతో మరోసారి ట్రోల్ అయ్యారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి (Abhinay reddy)ఇంధన ధరలు పెరుగుదలకు నిరసనగా ఆటోను ఎడ్ల బండిపై పెట్టి ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే! దీనిపై రష్మీ స్పందించారు ‘రాజకీయ నిరసనల కోసం మూగ జీవాలను హింసించడం సరికాదని ఆమె అన్నారు. ప్రచారం కోసం జంతువులపై క్రూరత్వం చూపడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. వైకాపా నేత ప్రదీప్ చింత చేసిన విమర్శలపై ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
‘నేను ఏ మతానికి, పార్టీకి వ్యతిరేకిని కారు. జంతువులపై జరిగే క్రూరత్వానికి మాత్రమే వ్యతిరేకిని. విమర్శలు ఎదుర్కోవడం నాకు కొత్తేమీ కాదు. గతంలోనూ అనేక సందర్హాల్లో తాను వేధింపులకు గురయ్యాను. సోషల్ మీడియాలో ఇలాంటి అవమానాలు, ట్రోలింగ్స్ నాకు కొత్త కాదు. నా సోషల్ మీడియా ప్రొఫైల్స్ మొత్తం గమనిస్తే.. పండుగల సమయంలో జరిగే జంతుబలిపై కూడా నేను నా గళాన్ని వినిపిస్తూనే ఉన్నాను. అప్పుడు కూడా నన్ను తిట్టారు. చివరకు గణపతికి గజమాల వేేస క్రమంలో అంకుశంతో ఏనుగు చర్మాన్ని చీల్చుతుంటే దానిపై ప్రశ్నించినందుకు నన్ను దేశద్రోహి అని పిలిచారు. జంతువులపై జరుగుతోన్న హింసపై నేను ఎన్నోసార్లు మాట్లాడాను. ఇక ముందు కూడా మాట్లాడుతూనే ఉంటాను. ఇక్కడ సమస్య ఏంటంటే.. మనం ఒక విషయం గురించి మాట్లాడితే జనాలు సంబంధం లేని ఇంకో విషయం గురించి మాట్లాడతారు. పోలికలు చూస్తారు. కానీ జరుగుతున్న హింసను ఆపడానికి ముందుకొచ్చేవారు ఒకరూ ఉండరు. నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఏ పార్టీ జంతు సంక్షేమం కోసం కృషి చేస్తుందో.. ఆ పార్టీకి బహిరంగంగా మద్దతు ఇస్తాను’ అని రష్మిక పోస్ట్‌లో పేర్కొన్నారు.