RAPO 23: శబ్దం.. విధ్వంసం

ABN , Publish Date - Jul 08 , 2026 | 08:19 AM

హీరో రామ్‌ పోతినేని తొలిసారి దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం ‘రాపో 23’.

RAPO 23

హీరో రామ్‌ పోతినేని (Ram Pothineni ) తొలిసారి దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం ‘రాపో 23’ (వర్కింగ్‌ టైటిల్‌). రాపో సినిమాటిక్స్‌ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఆరంభమైన ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. తాజాగా మేకర్స్‌ ఓ కీలక అప్డేట్‌ ఇచ్చారు. ‘ఖైదీ’, ‘పుష్ప 2’, ‘మహావతార్‌ నరసింహా’ చిత్రాలకు అదిరిపోయే నేపథ్య సంగీతం అందించిన సామ్‌ సీఎస్ (Sam CS) ఈ సినిమాకు సంగీతం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఓ గ్లింప్స్‌ విడుదల చేసి ఆయనకు స్వాగతం పలికారు.

RAPO 23.jfif

‘ప్రతి ప్రపంచానికి ఒక శబ్దం ఉంటుంది. ఈ ప్రపంచం విధ్వంసాన్ని శాసిస్తోంది’ అని పేర్కొన్నారు. ఆయన అందించే మ్యూజిక్‌ మరో స్థాయిలో ఉండనుందని, ఈ చిత్రానికే ప్రధానాకర్షణగా నిలుస్తుందని చెప్పారు. నియో-నోయర్‌ నేపథ్యంలో సాగే సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు రామ్‌ స్వయంగా కథ రాయడం విశేషం. ఇప్పటివరకూ తెలుగుతెరపై చూడని సరికొత్త అంశాలను ఇందులో చూపించనున్నారు.

Updated Date - Jul 08 , 2026 | 08:19 AM