Mahesh Babu: రావు బహదూర్’ రిలీజ్ ఫిక్స్..
ABN , Publish Date - Apr 26 , 2026 | 07:10 PM
సత్యదేవ్ (Satyadev) హీరోగా వెంకటేశ్ మహా (Venkatesh Maha) తెరకెక్కిస్తున్న చిత్రం ‘రావు బహదూర్’(Rao bahadur).
సత్యదేవ్ (Satyadev) హీరోగా వెంకటేశ్ మహా (Venkatesh Maha) తెరకెక్కిస్తున్న చిత్రం ‘రావు బహదూర్’(Rao bahadur). ‘జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్‌బాబు సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. జూన్ 5న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు. రాజవంశం నేపథ్యంతో సాగే సైకలాజికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇంతకుముందు సత్యదేవ్, వెంకటేశ్ మహా కాంబోలో వచ్చిన ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రానికి పూర్తి భిన్నమైన సినిమా ఇది. ఇందులో సత్యదేవ్ సరసన దీపా థామస్ కథానాయికగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందు యశ్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రం విడుదల కానుంది. ఓ రకంగా అది ఈ సినిమాకు పోటీ అనే చెప్పాలి.