పాకిస్తాన్ భవిష్యత్తును.. భారత్ నిర్ణయిస్తుంది! ధురంధర్.. తెలుగు ట్రైలర్ అదిరింది
ABN , Publish Date - Mar 08 , 2026 | 02:21 PM
గత డిసెంబర్‌లో దేశ వ్యాప్తంగా థియేటర్లకు వచ్చి సంచలనాలు సృష్టించిన బాలీవుడ్ చిత్రం 'ధురంధర్'. ఇప్పుడు దాని సీక్వెల్ తెలుగు ట్రైలర్ విడుదల అయింది.
గత డిసెంబర్‌లో దేశ వ్యాప్తంగా థియేటర్లకు వచ్చి సంచలనాలు సృష్టించిన బాలీవుడ్ చిత్రం ధురంధర్ (Dhurandhar The Revenge). రణవీర్ సింగ్ (Ranveer Singh), అక్షయ్ ఖన్నా, అర్జున్ రామ్‌పాల్, సంజయ్ దత్, సారా అర్జున్ వంటి స్టార్లు నటించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి నాలుగు నెలల అవుతున్నా ఇంకా ప్రేక్షకులను వెంటాడుతూనే ఉంది.
ఇప్పటికే ఓటీటీల్లోనూ వచ్చిన ఈ మూవీ థియేటర్లలోనూ విజయవంతంగా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం సెకండ్ పార్ట్, ధురంధర్ ది రివేంజ్ (Dhurandhar The Revenge) మార్చి 19న విడుదలకు రెడీ అయింది. ఇప్పటికే మొదటి భాగానికి ఎవరూ ఊహించని రెస్పాన్స్ రావడంతో రెండవ భాగంపై అంతకుమించి అనే రేంజ్‌లో అంచనాలు అంబరాన్ని తాకాయి.
ఇదిలా ఉంటే.. మొదటి పార్ట్ కేవలం హిందీ భాషలోనే రిలీజ్ చేసిన మేకర్స్ ఇప్పుడు రాబోతున్న సెకండ్ పార్ట్‌ను తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ శనివారం హిందీ వర్షన్ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆదివారం తెలుగు వెర్షన్ విడుదల చేశారు.
అయితే.. ఓ పెద్ద హీరో నటించిన స్ట్రెయిట్ తెలుగు మూవీ ట్రైలర్లకు దీటుగా ఈ చిత్రం ట్రైలర్ గంటల వ్యవధిలోనే మిలియన్ల కొద్ది వ్యూస్ దక్కించుకుంటూ తెలుగునాట కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఇక ట్రైలర్ చివరలో వచ్చే 'ఇకపై పాకిస్తాన్ భవిష్యత్తును భారత్ నిర్ణయిస్తుంది' అనే డైలాగ్ మాత్రం ప్రతి ఒక్క ఇండియన్‌కు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. చూస్తుంటే ఈ ఉగాదికి ధురంధర్ 2 సినిమా తెలుగునాట ప్రభంజనం సృష్టించేలా ఉంది.