సంక్రాంతి రేస్‌లో క్రేజీ కామెడీ రైడ్.. గోల్డెన్ భాగ్యం అంటున్న కమెడియన్స్
ABN , Publish Date - Sep 29 , 2026 | 04:45 PM
తెలుగు, తమిళ చిత్రసీమల్లో తమదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న ప్రముఖ నటులు సత్య, యోగి బాబు ప్రధాన పాత్రల్లో ఓ ఆసక్తికరమైన చిత్రం రూపుదిద్దుకుంటోంది .
తెలుగు, తమిళ చిత్రసీమల్లో తమదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న ప్రముఖ నటులు సత్య (Satya), యోగి బాబు yogibabu) ప్రధాన పాత్రల్లో ఓ ఆసక్తికరమైన చిత్రం రూపుదిద్దుకుంటోంది . ఈ చిత్రానికి గోల్డెన్ భాగ్యం (Golden Bhagyam) అనే క్రేజీ టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం మంగళవారం అధికారిక టైటిల్ టీజర్‌ను విడుదల చేసింది. రంగబలి చిత్రంతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన పవన్ బాసంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోండగా.. డ్రీమ్ మూవీ మేకర్స్, నయావాయు చిత్రాలు పతాకాలపై డాక్టర్ నాగార్జున రెడ్డి పలువాయి, శ్రీకాంత్ రెడ్డి బాసిరెడ్డి, బాపిరెడ్డి పదాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు
తాజాగా విడుదలైన టైటిల్ టీజర్ అత్యంత వినోదాత్మకంగా, ఎనర్జెటిక్‌గా సాగింది. తెలుగు,తమిళ సినీ వర్గాలను కలిపే కాన్సెప్ట్‌తో తెలుమిల్ మూవీగా దీనిని పరిచయం చేయడం విశేషం. సాంబార్ ఇడ్లీ, బిర్యానీ కలిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారని మేకర్స్ తెలిపారు. ఈ టీజర్‌లో సత్య, యోగి బాబు కలిసి చేసిన సందడి, వారి మధ్య వచ్చిన వినోదాత్మక సంభాషణలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి . కామెడీతో పాటు క్రైమ్, యాక్షన్, లవ్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో ప్రధానాంశాలుగా ఉండబోతున్నాయని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది.
పవన్ సి.హెచ్, నితీష్ జాన్ అందిస్తున్న నేపథ్య సంగీతం , బబ్లూ అజు ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రాన్ని రాబోయే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కామెడీ పవర్ హౌస్‌లుగా గుర్తింపు పొందిన సత్య, యోగి బాబు జోడీగా వస్తుండటంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాతో యోగిబాబు తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.