‘జై హనుమాన్’.. కీలక పాత్రలో రానా
ABN , Publish Date - Apr 10 , 2026 | 07:04 AM
చాలా గ్యాప్ తరువాత హీరో దగ్గుబాటి రానా వెండితెరపై కనిపించ బోతున్నారు.
చాలా గ్యాప్ తరువాత హీరో దగ్గుబాటి రానా (Rana Daggubati) వెండితెరపై కనిపించబోతున్నారు. రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘జై హనుమాన్’ (Jai Hanuman) లో ఆయన కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
రానా లాంటి నటుడు ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నారంటే కచ్చితంగా అది కథలో అత్యంత కీలక పాత్రే అయి ఉంటుందని భావిస్తున్నారు. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) తన సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ‘జై హనుమాన్’ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ప్రతిష్ఠాత్మకంగా దీనిని నిర్మిస్తోంది.
ఇదిలాఉంటే.. రెండు నెలల క్రితం ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ సైలెంట్‌గా జరుగుతూ ఉండగా డీవోపీ తిరునావుక్కరుసు స్థానంలో లక్కీ భాస్కర్ ఫేం నిమిశ్ రవి (Nimish Ravi) రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి (MM Keeravani) సంగీతం అందిస్తుండడం విశేషం.