Ramyakrishnan: అవును.. నా భర్త, నేను వేరువేరుగా ఉంటున్నాం
ABN , Publish Date - Nov 15 , 2026 | 04:22 PM
టాలీవుడ్లో ఎవర్ గ్రీన్ నటిగా పేరుగాంచిన రమ్యకృష్ణ (Ramya Krishnan) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా, విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.
టాలీవుడ్లో ఎవర్ గ్రీన్ నటిగా పేరుగాంచిన రమ్యకృష్ణ (Ramya Krishnan) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా, విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ముఖ్యంగా బాహుబలి సినిమాలో రాజమాత పాత్రలో ఆమెను తప్ప ఇంకోకరిని ఊహించలేరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె మొట్టమొదటిసారి ఒక పాడ్ క్యాస్ట్ లో పాల్గొంది. ఇందులో ఆమె ఎన్నో విషయాలను తెలిపింది.
ఇక సినిమాల గురించి పక్కన పెడితే గతకొంతకాలంగా రమ్యకృష్ణ తన భర్త కృష్ణవంశీతో విడిపోయిందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కృష్ణవంశీ ఈ విడాకుల వార్తలపై స్పందించాడు. తామిద్దరం విడిగా ఉన్నా కూడా కలిసే ఉంటామని, కొడుకు కోసమే తాము దూరంగా ఉంటున్నామని చెప్పాడు. తాజాగా ఈ విడాకుల రూమర్స్ పై రమ్యకృష్ణ కూడా స్పందించింది. తాము విడిపోలేదని, కేవలం తమ సౌలభ్యం కోసమే రెండు వేర్వేరు నగరాల్లో సంతోషంగా జీవిస్తున్నామని ఆమె స్పష్టం చేసింది.
'మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. కానీ ప్రస్తుతం మా సౌలభ్యం కోసం రెండు వేర్వేరు నగరాల్లో (చెన్నై, హైదరాబాద్) ఎంతో సంతోషంగా ఉంటున్నాము. ఎప్పుడూ గొడవలు పడే కంటే, ఇలా దూరంగా ఉంటూ మంచి స్నేహితుల్లా ఉండటమే చాలా బెటర్ అనిపిస్తోంది. బహుశా అందుకే మేము ఇప్పటికీ భార్యాభర్తలుగా కొనసాగుతున్నామేమో" అంటూ చాలా ప్రాక్టికల్‌గా మరియు నిజాయితీగా సమాధానమిచ్చింది. అంతేకాకుండా కొడుకు ఆరోగ్య దృష్ట్యా చెన్నైలోనే ఉంచామని, ఆయన వర్క్ ఆయనది.. తన వర్క్ తనది అని తెలిపింది. ఇక సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై నిత్యం ఏదో ఒక ఊహాగానాలు వస్తుంటాయని, అయితే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని రమ్యకృష్ణ తన మాటలతో తేల్చిచెప్పింది.
అలాగే కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు తాను ఏనాడూ వ్యక్తిగత విషయాలను సినిమా కెరీర్‌తో ముడిపెట్టలేదని, వివాహం తర్వాత కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కాపాడుకుంటూ, ఇటు ఫ్యామిలీ లైఫ్‌ను అటు ప్రొఫెషనల్ లైఫ్‌ను ఎంతో బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఏదేమైనా రమ్యకృష్ణ తన పర్సనల్ లైఫ్ గురించి ఇంత స్పష్టంగా మాట్లాడటం ప్రస్తుతం టాలీవుడ్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.