Ram Charan: నా లైబ్రరీలో ‘పెద్ది’ అలాంటి సినిమానే..

ABN , Publish Date - May 18 , 2026 | 09:07 PM

ప్రతి మనిషి గుర్తింపును కోరుకుంటాడు. అలాంటి గుర్తింపు కోసమే పోరాటం చేసే వ్యక్తి కథే ఇది. కొన్ని కథలు కుదరడానికి ఏళ్ల సమయం పడుతుంది అని చెప్పారు రామ్ చరణ్‌.

‘ప్రతి మనిషి గుర్తింపును కోరుకుంటాడు. అలాంటి గుర్తింపు కోసం పోరాటం చేసే వ్యక్తి కథే ఇది. కొన్ని కథలు కుదరడానికి ఏళ్ల సమయం పడుతుంది. ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. మంచి చిత్రాలు రావడం అంత ఈజీ కాదు. నా లైబ్రరీలో ‘పెద్ది’ అలాంటిదే’ అని రామ్‌ చరణ్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా పెద్ది. జాన్వీకపూర్‌ కథానాయిక. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వెంకట సతీశ్‌ కిలారు, ఇషాన్‌ సక్సేనా దీనిని నిర్మించారు. జూన్‌ 4న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం ముంబైలో ట్రైలర్‌ను విడుదల చేశారు.

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ‘రెండేళ్లగా పెద్ది కోసం రాత్రింబవళ్లూ కష్టపడి పనిచేశాం. శరీరంలోని ప్రతి అణువు ఈ కథతో నిండిపోయింది. ‘పెద్ది’ని శ్వాసగా తీసుకున్నాం. బుచ్చిబాబు ఐదేళ్లగా ఈ కథతో ప్రయాణం చేస్తున్నాడు. మా అందరి కంటే ఆయన ఎక్కువ కష్టపడ్డారు. ఈ సినిమాకు ఏ.ఆర్‌. రెహమాన్‌ సెంటర్‌ పిల్లర్‌. దివ్యేందు శర్మ డైలాగ్స్ తెలుగులో నేర్చుకుని చెప్పేవారు. జాన్వీ ఈ సినిమాకు స్పెషల్‌ ఎట్రాక్షన్‌. డ్యాన్స్‌ ఇరగదీసింది. 85 రోజులు సినిమా షూటింగ్‌ చేశాం. కుస్తీ పహిల్వాన్‌ షూటింగ్‌ చేస్తున్న సమయంలో నా చేతికి గాయమైంది. శిక్షణ పొందిన ఆర్టిస్ట్‌ను పిలిపించమంటే బుచ్చి నిజమైన పహిల్వాన్‌లను రంగంలోకి దింపాడు. యాక్షన్‌ చెబితే, గట్టిగా పట్టేసుకునేవారు. అలా చేతికి గాయమైంది. లాస్ట్‌ సాంగ్‌కి సమయం సరిపోలేదు. అయినా జాన్వీ అప్పటికప్పుడు స్టెప్స్‌ నేర్చుకుని చేసింది. నాన్న, శ్రీదేవి కలిసి నటించారు. నేను, జాన్వీ కూడా కలిసి సినిమా చేయాలనే అభిమానుల కోరిక ఈ సినిమాతో నెరవేరింది. ‘దంగల్‌’, ‘సుల్తాన్‌’ వంటి సినిమాలు 'పెద్ది'కి దారి చూపాయి.

జాన్వీ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నా పాత్ర చూపించిన యాటిట్యూడ్‌ అంతా బుచ్చిబాబు వల్లే వచ్చింది. నిజం చెప్పాలంటే బుచ్చిబాబు ఓ రౌడీ డైరెక్టర్‌’ అని అన్నారు.

Updated Date - May 19 , 2026 | 07:54 AM