రామ్ పోతినేనితో అనిరుధ్!

ABN , Publish Date - Mar 26 , 2026 | 06:32 PM

బాడీలో ఎనర్జీ ఎంత ఉన్నా.. మూవీలో సత్తాలేకపోవడంతో హీరో రామ్ పోతినేని డీలా పడిపోయాడు. చేసిన సినిమాలు చేసినట్టు పోతుంటే టెన్షన్ కు గురవుతున్నాడు. అందుకే ఈసారి పక్కాగా హిట్ కొట్టాలని ఓ ప్లాన్ వేశాడు.

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒక సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎంత పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేసినా అవి ఆశించిన విజయం సాధించకపోవడంతో.. ఇప్పుడు కొత్త స్ట్రాటజీని అమలు చేస్తున్నాడు. సినిమాలను బలంగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలంటే కేవలం స్టోరీ, డైరెక్టర్ మీద మాత్రమే కాకుండా... మ్యూజిక్ మీద కూడా పూర్తి ఫోకస్ పెట్టాలని భావించాడు. ఇందులో భాగంగా సౌత్ ఇండియా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌ను తన తదుపరి ప్రాజెక్ట్‌లోకి తీసుకురావడానికి రామ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.


‘ఇస్మార్ట్ శంకర్’తో మాస్ ఇమేజ్ సంపాదించిన రామ్‌కు తర్వాతి చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. గత ఏడాది వచ్చిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా కోసం స్వయంగా పాట రాసి పాడినా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ క్రియేట్ చేయలేదు. అందుకే ఈసారి మ్యూజిక్‌పైనే స్పెషల్ ఫోకస్ పెట్టి.. మ్యూజిక్‌తో హైప్ తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నాడట. తన సినిమాకు అనిరుధ్ బ్రాండ్ తోడైతే నెక్ట్స్ లెవల్‌లో ఫ్యాన్స్‌ను అలరించవచ్చని భావిస్తున్నారట.

రామ్ నెక్స్ట్ మూవీని లోకేష్ కనగరాజ్ అసోసియేట్ డైరెక్టర్‌ లోగి విఘ్నేశ్‌తో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కొత్త దర్శకుడి ఫ్రెష్ విజన్, అనిరుధ్ అద్భుతమైన ట్యూన్స్, రామ్ పోతినేని అపారమైన ఎనర్జీ కలిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని అంచనా వేస్తున్నారు. అయితే గతంలో మాదిరి ఈ కొత్త సినిమాకు రామ్ స్వయంగా లిరిక్స్ రాస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అనిరుధ్ సంగీతంతో రామ్ సాహిత్యం కలిస్తే అది డబుల్ ధమాకా అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఆస్కారం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Read Also: ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. ఇస్తున్న జక్కన్న! హైప్‌ అస్సలు.. తగ్గనివ్వటం లేదుగా

Read Also: 'ధురంధర్' ద‌ర్శ‌కుడికి నో.. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న అల్లు అర్జున్

Updated Date - Mar 26 , 2026 | 06:32 PM