నేను చనిపోయినా బతికే ఉంటాను.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 24 , 2026 | 07:36 PM

ఈమధ్య వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొద్దిగా వివాదాలు తగ్గించాడు. నిత్యం ఏదో ఒక వివాదాన్ని కొనితెచ్చుకొనే వర్మ తాజాగా తను చనిపోయినా బతికే ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలిపి షాక్ ఇచ్చాడు.

Ram Gopal Varma

ఈమధ్య వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కొద్దిగా వివాదాలు తగ్గించాడు. నిత్యం ఏదో ఒక వివాదాన్ని కొనితెచ్చుకొనే వర్మ తాజాగా తను చనిపోయినా బతికే ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలిపి షాక్ ఇచ్చాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఏదైనా చేయగలమని అందరికీ తెల్సిందే. కానీ, వర్మ ఆ టెక్నాలజీతో డిజిటల్ క్లోన్ తయారు చేయించాడు. హరి గాడిపూడి అనే ఏఐ ఇంజనీర్ తన కోసం ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ క్లోన్ చూసి ఆర్జీవీ ఫిదా అయ్యాదూ. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆ డిజిటల్ క్లోన్ లింక్‌ను షేర్ చేస్తూ.. 'నేను చనిపోయిన తర్వాత కూడా బతికే ఉంటాను. సింప్లీ అమేజింగ్.. ఏ సబ్జెక్ట్ మీద ఎవరు ఏ ప్రశ్న అడిగినా నా స్టైల్‌లో, నా ఆలోచనా విధానానికి అనుగుణంగా ఈ డిజిటల్ క్లోన్ సమాధానం చెబుతుంది' అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.


ఈ డిజిటల్ క్లోన్ మొదటి పేజీలో ఆర్జీవీ దీని పనితీరును వివరిస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇది ప్రధానంగా రామూయిజం సిద్ధాంతాల ఆధారంగా పనిచేస్తుందని, ప్రస్తుతానికి ఇది ఎలా పనిచేస్తుందో అందరికీ ఒక అవగాహన రావడానికి చిన్న సెషన్లను అందుబాటులో ఉంచామని తెలిపాడు. అంతేకాదు, తదుపరి అప్‌డేట్‌లలో ఈ డిజిటల్ క్లోన్ మరింత అడ్వాన్స్‌డ్‌గా మారబోతోందని, రాబోయే వెర్షన్లలో తన స్నేహితులను గుర్తుపట్టడం, తన అభిరుచికి తగ్గట్టుగా సినిమా కథలను రివ్యూ చేయడం, స్వయంగా కథలు రాయడం, పూర్తిస్థాయి నిడివి గల AI సినిమాలను రూపొందించడం వంటివి కూడా డిజిటల్ క్లోన్ చేస్తుందని ఆర్జీవీ ప్రకటించాడు.


గత కొంతకాలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యతపై ఆర్జీవీ గట్టిగా గళం వినిపిస్తున్న విషయం తెల్సిందే. మారుతున్న కాలానికి అనుగుణంగా యూనివర్సిటీలు, మంత్రులు లేదా పాత విద్యా విధానాలు మారకపోతే AI వేవ్ వాటన్నింటినీ తుడిచిపెట్టేస్తుందని, ఇందులో మొదట బలయ్యేది విద్యార్థులేనని ఆయన హెచ్చరిస్తూన్నాడు. ఇప్పుడు ఏకంగా తన ఆలోచనలనే డిజిటల్ రూపంలోకి తీసుకురావడంతో నెట్టింట ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.మరి ముందు ముందు ఈ డిజిటల్ క్లోన్ ఎలా పనిచేస్తుందో చూడాలి.

Updated Date - Nov 24 , 2026 | 07:39 PM