సక్సెస్ ఫుల్‌గా రామ్ చరణ్ సర్జరీ పూర్తి..

ABN , Publish Date - Jul 27 , 2026 | 06:56 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మణికట్టు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. తమిళనాడులోని కోయంబత్తూరు గంగా ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్య బృందం ఈ ఆపరేషన్‌ను సమర్థవంతంగా పూర్తి చేసింది.

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మణికట్టు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. తమిళనాడులోని కోయంబత్తూరు గంగా ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్య బృందం డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ అలెహాండ్రో బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ అలాగే వారి నిపుణుల బృందం కలిసి ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితి ఎంతో సంతృప్తికరంగా ఉందని, మరో నాలుగు రోజుల విశ్రాంతి అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉందని సమాచారం. పెద్ది సినిమా షూటింగ్ సమయంలో చరణ్ మణికట్టుకు గాయం అయిన విషయం తెల్సిందే. ఆ సమయంలోనే డాక్టర్స్ సర్జరీ చేయాలని చెప్పగా.. పెద్ది ప్రమోషన్స్ కోసం సర్జరీని వాయిదా వేశాడు. ఇక పెద్ది సినిమా రిలీజ్ కూడా అవ్వడంతో చరణ్ ఇప్పుడు సర్జరీ చేయించుకున్నాడు.


హైదరాబాద్ వచ్చిన తర్వాత రామ్ చరణ్ కొన్ని రోజుల పాటు వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకోనున్నాడు. చరణ్ కోలుకున్న అనంతరం తన తదుపరి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పనుల్లో పాల్గొననున్నాడు. పెద్ది తరువాత చరణ్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ RC17 ప్రీ-ప్రొడక్షన్ పనులను రామ్ చరణ్ పునఃప్రారంభించనున్నాడు.


రంగస్థలం లాంటి ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ఇక చరణ్ సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తికావడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చి షూటింగ్‌లో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నారు.

Updated Date - Jul 27 , 2026 | 07:49 PM