Peddi: పెద్ది రిలీజ్ వాయిదా..
ABN , Publish Date - Jan 03 , 2026 | 04:43 PM
కొత్త సంవత్సరం.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అభిమానులకు ట్రీట్ ఇస్తాడనుకుంటే.. షాక్ ఇచ్చాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
Peddi: కొత్త సంవత్సరం.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అభిమానులకు ట్రీట్ ఇస్తాడనుకుంటే.. షాక్ ఇచ్చాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న చిత్రం పెద్ది (Peddi). బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మెగా ఫ్యాన్స్ అందరూ పెద్దిపైనే ఆశలు పెట్టుకున్నారు.
మార్చి 27 అనగా రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా పెద్ది సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు తగ్గట్లే షూటింగ్ ని ఫినిష్ చేస్తూ.. ఇంకోపక్క ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇక అందరూ అనుకున్నట్లుగానే న్యూయర్ కి పెద్ది నుంచి ఒక సర్ ప్రైజ్ పోస్టర్ కానీ, గ్లింప్స్ కానీ వస్తుంది అనుకుంటే.. మేకర్స్ మాత్రం ఈసారి చాలా సైలెంట్ గా ఉన్నారు. ఈ మౌనం వెనుక కారణం సినిమా వాయిదా పడడమే అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
షూటింగ్ ఇంకా ఫినిష్ కాకపోవడం, కొన్ని సాంకేతిక కారణాల వలన మేకర్స్ పెద్దిని మార్చి 27 న రిలీజ్ చేయలేరని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ విషయం తెలియడంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇక పెద్ది కనుక ఆ టైమ్ రాకపోతే.. ది ప్యారడైజ్, టాక్సిక్ సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ వార్తలపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.