చిరంజీవి కొడుకా.. మజాకానా.. ఆ గ్రేస్ ఏంటి స్వామీ

ABN , Publish Date - May 24 , 2026 | 03:52 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పెద్ది (Peddi) సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న విషయం తెల్సిందే.

Peddi Movie

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పెద్ది (Peddi) సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ డ్యాన్స్ నెంబర్ హల్లెల్లేల్లో సాంగ్ ని రిలీజ్ చేశారు.


సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పొచ్చు. అప్పుడెప్పుడో మహేష్ బాబుతో ఐటెం సాంగ్ చేసిన శృతిహాసన్.. చాలా గ్యాప్ తర్వాత చరణ్ తో కలిసి స్టెప్స్ వేసింది. ఇక శృతి అందాన్నే తట్టుకోలేం అనుకుంటే.. ఈ సాంగ్ లోకి జాన్వీ కపూర్ ని కూడా దింపాడు బుచ్చి. ఇంకేం ఉంది.. హల్లెల్లేల్లో సాంగ్ చూడడానికి ఫ్యాన్స్ కి రెండు కళ్ళు సరిపోవడం లేదు అని చెప్పొచ్చు. చిన్నదో వైపు.. పెద్దదో వైపు అన్నట్లు.. ఇద్దరు అందగత్తెలతో చరణ్ ఆడేసుకున్నాడు. సాధారణంగా ఐటెంసాంగ్ అంటే అందరి కళ్ళు హీరోయిన్ల అందాల వైపే పోతుంది. కానీ, మొదటిసారి ఇద్దరు అందగత్తెలు ఉన్నా ఈ సాంగ్ లో అందరి కళ్ళు చరణ్ డ్యాన్స్ మీదనే ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


టాలీవుడ్‌లోనే బెస్ట్ డ్యాన్సర్లలో ఒకరైన రామ్ చరణ్.. చాలా కాలం తర్వాత ఒక పక్కా లోకల్, రూటెడ్ మాస్ సాంగ్‌లో తన డ్యాన్స్ పవర్‌ను చూపించాడు చరణ్. ఆ గ్రేస్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. జానీ మాస్టర్ స్టెప్స్.. చరణ్ గ్రేస్ తోడైతే థియేటర్లు బద్దలు అవ్వాల్సిందే. చరణ్ బాడీ లాంగ్వేజ్, ఆయన వేసిన ఫాస్ట్ అండ్ సింక్ స్టెప్స్ నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. చరణ్ రగ్గడ్ లుక్, వింటేజ్ హెయిర్‌స్టైల్‌తో మాస్ డ్యాన్స్ చేస్తుంటే ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. శృతి, జాన్వీ కూడా చరణ్ గ్రేస్ ని అందుకోలేకపోయారు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ సాంగ్ లో చరణ్ గ్రేస్ చూసి ఫ్యాన్స్ అందరూ చిరంజీవిని గుర్తుచేసుకుంటున్నారు. చిరంజీవి కొడుకా.. మజాకానా గ్రేస్ లో తండ్రీకొడుకులను కొట్టేవారే లేరు అని చెప్పుకొస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్‌కు రామ్ చరణ్ వేసిన స్టెప్పులు చూసి మెగా ఫ్యాన్స్ థియేటర్లలో పూనకాలే అని ఫిక్స్ అయిపోతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Updated Date - May 24 , 2026 | 04:02 PM