ఆ సినిమా నుంచి తప్పుకున్న చరణ్..

ABN , Publish Date - Apr 29 , 2026 | 05:34 PM

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చిన విషయం తెల్సిందే.

Ram Charan

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆయన బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తున్నారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. గత కొన్నిరోజులుగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bansali) ప్రొడక్షన్ లో పి.ఎస్. మిథ్రాన్ దర్శకత్వంలో చరణ్ నటించనున్నారని టాక్ నడుస్తోన్న విషయం తెల్సిందే. ఇప్పటికే చరణ్ ముంబైలోని భన్సాలీ ఆఫీస్ లో చాలాసార్లు కనిపించడంతో ఈ వార్తలు నిజమే అని అనుకున్నారు. అయితే తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం చరణ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.


భన్సాలీ- చరణ్ కాంబో కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్నారు. కానీ, ఇప్పుడు ఈ కాంబో కుదరలేదని సమాచారం. చరణే ఈ సినిమా నుంచి తప్పుకున్నారా.. ? లేక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఇక చరణ్ తప్పుకోవడంతో ఈ ఛాన్స్ ను ధనుష్ అందుకున్నారు. ఇప్పటికే ధనుష్ బాలీవుడ్ లో పాగా వేశారు. ఈ ఏడాది తేరే ఇష్క్ మే సినిమాతో అభిమానులను అలరించారు. చరణ్ తప్పుకోవడంతో ఈ కథను ధనుష్ కి వినిపించడం, వెంటనే ఆయన ఓకే అన్నట్లు సమాచారం.


ధనుష్- భన్సాలీ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ లోపు ధనుష్ తన చేతిలో ఉన్న సినిమాలను ముగించనున్నారు. ధనుష్ ప్రస్తుతం రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో డి55 షూటింగ్‌లో ఉన్నారు. ఇది కాకుండా మారి సెల్వరాజ్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ప్రముఖ తమిళ నటుడు పచ్చైముత్తు తమిళరసన్‌తో ఒక సినిమా, వడ చెన్నై 2 ధనుష్ చేతిలో ఉన్నాయి. ఇక ఆయన నటించిన తాజా చిత్రం కార ఏప్రిల్ 30 న రిలీజ్ కానుంది.

Updated Date - Apr 29 , 2026 | 05:59 PM