దేవుడా.. రామ్‌చరణ్ బాడీగార్డ్ మామూలోడు కాదు బాబోయ్..
ABN , Publish Date - Jun 02 , 2026 | 03:59 PM
అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం ఇండస్ట్రీలో అయితే రామ్ చరణ్ (Ram Charan) బాడీగార్డ్ కి అదృష్టం వరించింది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా.. అతనే కనిపిస్తున్నాడు.
అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం ఇండస్ట్రీలో అయితే రామ్ చరణ్ (Ram Charan) బాడీగార్డ్ కి అదృష్టం వరించింది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా.. అతనే కనిపిస్తున్నాడు. నిజం చెప్పాలంటే బాడీగార్డ్ కే బాడీగార్డ్ కావాల్సివస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్సనల్ బాడీగార్డ్ కెవిన్ కె కుంట (Kevin K Kunta) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ది ప్రమోషన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇతగాడి పేరు మారుమ్రోగిపోతోంది.
తాజాగా పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కెవిన్ చేసిన పనికి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా షాక్ అయ్యింది. అంతలా కెవిన్ ఏం చేశాడంటే.. సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే.. హీరోల వీరాభిమానులు అందరిని దాటుకొని హీరోల వద్దకు వచ్చి సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారిని అడ్డుకోవడానికి బాడీగార్డ్ లు వస్తారు. వారిని పక్కకు నెట్టి హీరో ఆ అభిమానికి సెల్ఫీ ఇస్తాడు. ఇది ప్రతిసారి జరిగేదే. కానీ, ఈసారి.. చరణ్ దగ్గరకు ఆ అభిమానిని పోనివ్వకుండా మధ్యలోనే కెవిన్ అడ్డుపడ్డాడు. అంతేకాకుండా అతడిని ఒక ఉదుటున ఎత్తిపట్టుకొని ఆమడ దూరంలో పడేశాడు. ఒక మనిషిని ఆ రేంజ్ లో ఎత్తుకొని పక్కన పడేయడం చూసిన జాన్వీ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
అసలు కెవిన్ అలా ఎలా చేయగలిగాడు .. ఇతను మామూలోడు కాదు బాబోయ్ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. నిజంగానే కెవిన్ మామూలోడు కాదు. ఆఫ్రికా ఖండంలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్, ప్రస్తుతం ఇటలీలో నివసిస్తూ అక్కడ ప్రొఫెషనల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా రికార్డులు సృష్టించాడు. ఇటలీలో నేషనల్ మిడిల్‌వెయిట్ MMA ఛాంపియన్ గా నిలిచిన కెవిన్, ఎన్నో అంతర్జాతీయ రింగ్ ఫైట్స్‌లో పవర్‌ఫుల్ టైటిల్స్ గెలుచుకున్నాడు. కేవలం రింగ్ లోపలే కాకుండా, రియల్ లైఫ్‌లో సెలబ్రిటీలు, అంతర్జాతీయ విఐపిలకు అత్యున్నత స్థాయి క్లోజ్ ప్రొటెక్షన్ VVIP సెక్యూరిటీ అందించే ప్రొఫెషనల్ బాడీగార్డ్‌గా కూడా ఇతనికి భారీ డిమాండ్ ఉంది. ఆ రేంజ్ రికార్డు ఉండబట్టే చరణ్ మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటున్నాడు. కెవిన్ కి నెలకు రూ 4 లక్షల జీతమని టాక్. ఇక తన బాడీగార్డ్ గురుంచి చరణ్ సైతం చెప్పుకొచ్చాడు. కెవిన్ ని తన కోసం కాదని.. పిల్లల కోసం నియమించినట్లు తెలిపాడు. ఏదిఏమైనా నాలుగేళ్లుగా చరణ్ కి సెక్యూరిటీగా ఉంటున్న కెవిన్ కి ఇప్పుడు గుర్తింపు వచ్చింది.