రామ్ చరణ్ బాడీగార్డ్‌కి.. రోజుకు ఇన్ని లక్షలా? ప‌ది ఫ్యామిలీలు బ‌తికేస్తాయిగా

ABN , Publish Date - May 25 , 2026 | 10:13 PM

ప్రస్తుతం ‘పెద్ది‘ చిత్రబృందం ప్రమోషన్స్ కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా బిజీగా గడుపుతోంది.

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ (janhvi kappor,) కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్యాన్-ఇండియా చిత్రం ‘పెద్ది‘ (Peddi). బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా జూన్ 4న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. 1980ల నాటి గ్రామీణ నేపథ్యంతో సాగే ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వంటి క్రీడల నేపథ్యంలో ఒక పల్లెటూరి యువకుడు తన ప్రతిభతో ఎలా ఎదిగాడు, సమాజం కోసం ఎలా పోరాడాడు అనే కథాంశంతో బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, ఇటీవల విడుదలైన ‘హల్లాళ్లో’ అనే మాస్ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచి సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్ కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా బిజీగా గడుపుతోంది. ఇటీవల ముంబైలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌ వేడుకను చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్‌తో పాటు ఆయన వెంటే ఉంటూ అందరి దృష్టిని ఆకర్షించిన ఒక ప్రత్యేక వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. చరణ్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయినప్పటి నుండి ఈవెంట్ పూర్తయ్యే వరకు అతడు నీడలా రక్షణగా నిలిచాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు.. అంతర్జాతీయ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ కెవిన్ కుంటా (kevin kunta).

సాధారణంగా స్టార్ హీరోల పక్కన బాడీగార్డ్స్ కనిపించడం కొత్తేమీ కాకపోయినప్పటికీ, కెవిన్ కుంటా నేపథ్యం మాత్రం చాలా ప్రత్యేకం. ఆఫ్రికా ఖండంలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్, ప్రస్తుతం ఇటలీలో స్థిరపడ్డారు. అక్కడ ప్రొఫెషనల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా రాణిస్తూ ఇటలీ మిడిల్ వెయిట్ ఛాంపియన్‌గా కూడా హిస్టరీ క్రియేట్ చేశారు. హాలీవుడ్ యాక్షన్ హీరో రేంజ్‌లో ఉన్న కెవిన్ సిక్స్‌ప్యాక్ బాడీ, భారీ కటౌట్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గ్లోబల్ స్టార్ పక్కన ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఏదో హాలీవుడ్ యాక్షన్ సినిమా సీన్ చూస్తున్నట్లు ఉందంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ ఫైటర్‌ను రామ్ చరణ్ తన వ్యక్తిగత భద్రత కోసం రంగంలోకి దించడం సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. దీనితో పాటు కెవిన్ కుంటాకు చెల్లిస్తున్న రెమ్యునరేషన్ గురించిన వార్తలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ అంతర్జాతీయ ఫైటర్‌ భద్రతకు గానూ చరణ్ రోజుకు దాదాపు రూ. 2 లక్షల వరకు పారితోషికం ఇస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ లెక్కన చూసుకుంటే భారతదేశంలోనే అత్యధిక జీతం అందుకుంటున్న టాప్ బాడీగార్డుల లిస్టులో కెవిన్ కూడా చేరిపోయినట్లయింది. అయితే వైరల్ అవుతున్న ఈ బాడీగార్డ్ జీతం వివరాలపై అధికారికంగా ఎలాంటి స్పష్టత రావాల్సి ఉంది.ces?సం.. ఒక్క‌టైన‌ థమన్‌-అనిరుధ్?

Updated Date - May 25 , 2026 | 10:13 PM