Sukumar: సుకుమార్.. దుబాయిలో ఏం చేస్తున్నారంటే.
ABN , Publish Date - Nov 21 , 2026 | 08:12 AM
రామ్‌చరణ్, సుకుమార్ (Ram Charan-Sukumar)కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ టాలీవుడ్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రామ్‌చరణ్, సుకుమార్ (Ram Charan-Sukumar)కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ టాలీవుడ్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటివరకు స్టైలిష్ హీరోగా కనిపించిన చరణ్‌ను చిట్టిబాబుగా పూర్తిగా మార్చేసి, అద్భుతమైన విజయాన్ని అందించారు సుకుమార్. ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘RC17’ (RC 17) వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఇటీవల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా దర్శకుడు సుకుమార్ తన టీమ్‌తో కలిసి దుబాయ్ వెళ్లినట్లు సమాచారం. అక్కడ కథకు సంబంధించిన కీలక చర్చలు, స్టోరీ సిట్టింగ్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి తొందరపడకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సుకుమార్ భావిస్తున్నారట. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ చివరి వారంలో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావించినప్పటికీ, స్క్రిప్ట్ పనులు పూర్తిస్థాయిలో కొలిక్కి వచ్చిన తర్వాతే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు చిత్రవర్గాలు నుంచి సమాచారం. దీనితో జనవరి తర్వాత చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్‌చరణ్ కూడా జనవరిలో షూటింగ్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో చరణ్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందట. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్ పూర్తయిందని, గత చిత్రాలకు భిన్నంగా బరువు తగ్గి, పొడవాటి జుట్టుతో సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ (భూషణ్ కుమార్), విజయ ప్రసాద్ బండ్రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.