Ram Charan: గంగా హాస్పిటల్ వైద్యులకు రామ్ చరణ్ కృతజ్ఞతలు.. 

ABN , Publish Date - Sep 28 , 2026 | 06:53 PM

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రముఖ వైద్యులు, గంగా హాస్పిటల్ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు.

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రముఖ వైద్యులు, గంగా హాస్పిటల్ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. తనకు అందించిన వైద్య సేవలు, చూపించిన శ్రద్ధకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్ట్‌ పెట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్. రాజా సబాపతి, డాక్టర్ ఎస్. రాజశేఖరన్, డాక్టర్ ప్రవీణ్ భారద్వాజ్‌లతో పాటు గంగా హాస్పిటల్ వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ మేరకు రామ్ చరణ్ తన పోస్ట్‌లో ‘‘చికిత్సా ప్రక్రియలో తమ నైపుణ్యం, శ్రద్ధ, అంకితభావంతో సేవలందించిన డాక్టర్ ఎస్. రాజా సబాపతి, డాక్టర్ ఎస్. రాజశేఖరన్, డాక్టర్ ప్రవీణ్ భారద్వాజ్‌లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. హాస్పిటల్‌లోని మొత్తం వైద్య బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి వైద్యుడు, నర్సు, సిబ్బంది ఎంతో ఆప్యాయతతో నన్ను చూసుకున్నారు. వారు అందించిన అద్భుతమైన సంరక్షణ, చూపించిన శ్రద్ధను ఎప్పటికీ మర్చిపోలేను. మీరందరూ చేసిన సేవలకు నేను నిజంగా కృతజ్ఞుడిని’’ అని పేర్కొన్నారు.

ఈ  సందర్భంగా గంగా హాస్పిటల్‌కు రామ్ చరణ్ అభినందనలు తెలిపారు. ప్రతిష్ఠాత్మకమైన నాస్ (NASS) ఔట్‌స్టాండింగ్ రీసెర్చ్ పేపర్ అవార్డును ఐదోసారి అందుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. వైద్య పరిశోధన రంగంలో గంగా హాస్పిటల్ సాధిస్తున్న విజయాలకు ఈ పురస్కారం నిదర్శనమని పేర్కొన్నారు. వైద్య రంగంలో అసాధారణ ప్రతిభకు, అంకితభావానికి దక్కిన గుర్తింపుగా ఈ అవార్డును అభివర్ణించారు. 

Updated Date - Sep 28 , 2026 | 06:53 PM