Ram Charan: ఎన్టీఆర్ 'క్రేజీ మ్యాడ్ డ్రైవర్'.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్!

ABN , Publish Date - Jan 17 , 2026 | 07:34 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (N. T. Rama Rao Jr.) మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (N. T. Rama Rao Jr.) మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ (RRR) ప్రమోషన్స్ సమయంలో వీరి స్నేహం ఏ స్థాయిలో ఉంటుందో ప్రపంచమంతా చూసింది. అయితే కొందరు ఇది కేవలం సినిమా ప్రమోషన్స్ కోసమే అని భావించినా, తాజాగా రామ్ చరణ్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఆ సందేహాలకు చెక్ పెట్టింది.

ఆ ఇంటర్వ్యూలో రామ్ చరణ్‌కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. "ఒకవేళ కారు 250 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటే, మీరు ఎవరి పక్కన కూర్చోవడానికి ఇష్టపడతారు?" అని యాంకర్ అడిగారు. దీనికి చరణ్ బదులిస్తూ.. సాధారణంగా తాను డ్రైవింగ్ సీటులో ఇతరులను కూర్చోనివ్వనని, కానీ ఎన్టీఆర్ విషయంలో మాత్రం అది మినహాయింపు అని చెప్పారు. తారక్‌ను ఒక 'క్రేజీ మ్యాడ్ డ్రైవర్' గా చరణ్ అభివర్ణించారు.

ఎన్టీఆర్ కారు నడుపుతుంటే పక్కన కూర్చుని ఆ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తానని తెలిపారు. తారక్ కేవలం కారు నడపడమే కాకుండా, రోడ్డును పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటారని కొనియాడారు. ఎన్టీఆర్‌తో కలిసి చేసిన ప్రతి ప్రయాణం తనకు ఒక మరపురాని, అద్భుతమైన అనుభవం అని చరణ్ చెప్పుకొచ్చారు. గతంలో కొందరు సెలబ్రెటీలు తారక్ స్పీడ్ డ్రైవింగ్ చూసి భయపడిన సందర్భాలు ఉన్నప్పటికీ, చరణ్ మాత్రం ఆయన డ్రైవింగ్‌ను ఎంతో ఇష్టపడతానని స్పష్టం చేశారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది (Peddi) చిత్రంలో నటిస్తున్నారు. తన కెరీర్‌లోనే అత్యంత ఆసక్తికరమైన పాత్ర ఇదని చరణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకులు ముందుకు రానుంది. అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jan 17 , 2026 | 07:41 PM