Ram Charan: మోదీ స్ఫూర్తిదాయకమైన కథ చెప్పారు
ABN , Publish Date - May 28 , 2026 | 05:02 PM
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న వరల్డ్‌వైడ్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంలో దేశంలోని ముఖ్య నగరాలో అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు చిత్ర బృందం.
రామ్‌చరణ్ (Ram charan) హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ (Peddi) చిత్రం జూన్ 4న వరల్డ్‌వైడ్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంలో దేశంలోని ముఖ్య నగరాలో అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు చిత్ర బృందం. గురవారం ఢిల్లీ ప్రెస్ మీట్ నిర్వహించారు. రామ్‌చరణ్, జాన్వీకపూర్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రామ్‌చరణ్ మాట్లాడుతూ ‘ఇంతకు ముందు ఢిల్లీ వచ్చినప్పుడు ప్రధానికి మోదీని కలిశాను. ‘పెద్ది’ సినిమా ఇతివృత్తం ఏంటని అడిగారు. ఓ విధంగా వికసిత్ భారత్ గురించి తెలిపే కథ అని ఆయనకు చెప్పాను. అప్పుడు ఆయన నాతో ఓ స్ఫూర్తినింపే స్టోరీని చెప్పారు. ‘పశ్చిమ బెంగాల్‌లోని ఓ గ్రామంలో మహ్మద్ అనే ఫుట్‌బాల్ ప్లేయర్ ఉండేవాడు. కొన్నేళ్ల క్రితమే భారత్ తరఫున ఆడాడు. తన ఊరికి గుర్తింపు తీసుకొచ్చాడు. ఆ గ్రామం నుంచి ఇప్పుడు 85 మంది ఆటగాళ్లు ఉన్నారు’ అని చెప్పారు. ఒక వ్యక్తి సమాజంలో ఎంతో మార్పు తీసుకురాగలడు అన్న దానికి ఆయన చెప్పిన ఈ కథ ఒక నిదర్శనం. పెద్ది కూడా అలాంటి చిత్రమే’ అని రామ్‌చరణ్ అన్నారు.
రామ్‌చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకుడు, వెంకట్ సతీశ్ కిలారు దీనిని నిర్మించారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు.