మరో రంగస్థలానికి కాస్త టైమ్ ఇవ్వమన్న చరణ్..

ABN , Publish Date - Jun 08 , 2026 | 04:36 PM

ఇండస్ట్రీలో కొన్ని కాంబోలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - సుకుమార్ (Sukumar) కాంబో కూడా అందులో ఒకటి. రంగస్థలం (Rangastalam) సినిమాతో వీరిద్దరూ ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించారు.

Ram Charan

ఇండస్ట్రీలో కొన్ని కాంబోలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - సుకుమార్ (Sukumar) కాంబో కూడా అందులో ఒకటి. రంగస్థలం (Rangasthalam) సినిమాతో వీరిద్దరూ ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించారు. ఈ సినిమా తరువాత ఎప్పుడెప్పుడు వీరి కాంబోలో సినిమా వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. పెద్ది తరువాత చరణ్ - సుకుమార్ కాంబోలో ఒక సినిమా రానుందని టాక్ నడుస్తోన్న విషయం తెలిసిందే.


పెద్ది రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన అందుకున్నా కూడా మంచి కలక్షన్స్ రాబడుతోంది.ఈ సినిమా కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడు. రియల్ రెజ్లర్లతో పోరాడడం వలన ఆయన చేతికి గాయమయ్యిన విషయం తెల్సిందే. అప్పుడే డాక్టర్లు ఆ చేతికి సర్జరీ చేయాలనీ చెప్పగా.. పెద్ది ప్రమోషన్స్ కోసం ఆ సర్జరీని వాయిదా వేశాడు చరణ్. ఇక ఇప్పుడు ఆ సర్జరీకి సిద్దమయ్యాడట చెర్రీ. దీంతో చరణ్ కొత్త ప్రాజెక్ట్ కాస్త ఆలస్యంగా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది.


గాయం తీవ్రత దృష్ట్యా వైద్యులు రామ్ చరణ్‌కు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కోలుకోవడానికి కనీసం ఒక మూడు నెలల సమయం పడుతుందని భావించిన చరణ్, దర్శకుడు సుకుమార్‌ను కొంత టైమ్ అడిగినట్లు సమాచారం. యాక్షన్ సీక్వెన్స్ మరియు భారీ షెడ్యూల్స్ ఉన్న సినిమా కావడంతో, పూర్తిగా ఫిట్ అయిన తర్వాతే సెట్స్ మీదకు వెళ్లాలని చరణ్ భావిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ గ్యాప్‌లో డైరెక్టర్ సుకుమార్ స్క్రిప్ట్‌కు మరిన్ని మెరుగులు దిద్దే పనిలో పడ్డాడని టాక్ అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. మరి ఈ కాంబోలో మరో రంగస్థలం లాంటి సినిమా వస్తుందా.. ? అనేది చూడాలి.

Updated Date - Jun 08 , 2026 | 05:12 PM