Ram Charan: కవల పిల్లలపై.. రామ్‌చరణ్ రియాక్షన్! ఏమన్నాడంటే
ABN , Publish Date - Feb 01 , 2026 | 01:16 PM
రామ్‌చరణ్(Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే! జనవరి 31వ తేది రాత్రి ఉపాసన ఓ బాబు, పాపకు జన్మనిచ్చారు.
రామ్‌చరణ్(Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే! జనవరి 31వ తేది రాత్రి ఉపాసన ఓ బాబు, పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అలాగే ఆదివారం ఉదయం మీడియా ముందుకొచ్చి తెలిపారు. తాజాగా ఇదే విషయంపై రామ్‌చరణ్ స్పందించారు. సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. ‘మా జీవితంలో మరో మధుర క్షణాన్ని మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మాకు ఒక బాబు, ఒక పాప జన్మించారు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడంతో ఎంతో ఆనందంగా ఉంది. మన జీవితంలో మహిళలే గొప్ప బలం. మాకు సంబంధించిన అన్ని విషయాల్లో మా వెంట నిలబడి అండగా ఉన్న అభిమానులకు, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ శక్తినిస్తాయి’ అని పేర్కొన్నారు. 
అలాగే ఆదివారం ఉదయం చిరంజీవి (Chiranjeevi) మీడియాతో మాట్లాడారు. ‘రామ్‌చరణ్, ఉపాసన దంపతులు శనివారం రాత్రి కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఉపాసన, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. మేమంతా కోరుకున్నట్లుగానే హనుమాన్ ఆశీస్సులతో ఓ మగబిడ్డ, ఓ ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చింది. కొణిదెల, కామినేని, మెగా అభిమానులకు ఇదెంతో ఆనందించదగ్గ విషయం. మమ్మల్ని అభిమానించే శ్రేయోభిలాషులు, అభిమానులు, మా మంచిని కాంక్షించే అందరితో ఈ శుభవార్తను పంచుకోవాలనిపించి మీ ముందుకు వచ్చాను. చెన్నై అపోలో క్రెడిల్ నుంచి వచ్చిన డా. సుమన గారు పురుడు పోశారు. క్లీంకారకు కూడా ఆమె చేశారు. డాక్టర్ రుమా సిన్హ, డాక్టర్ లతకు కృతజ్ఞతలు. మా అభిమానులకు ఇది ఎంతో ఆనందకర సమయం’ అని అన్నారు. ఈ కాన్పులో మొదట బాబు, తదుపరి పాప ప్రసవించారని తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, డాక్టర్లు చెప్పారు.