డాల్బీ సినిమాస్ ఫార్మెట్‌లో 'పెద్ది'
ABN , Publish Date - Mar 13 , 2026 | 07:42 AM
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘పెద్ది’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi) చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని అత్యాధునిక డాల్బీ సినిమాస్ ఫార్మెట్‌లో ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
రామ్‌చరణ్ మాస్ రగ్గడ్ అవతార్‌ను డాల్బీ సినిమాస్ ఫార్మెట్‌లో చూడడం ప్రేక్షకులకు కొత్త అనుభూతి అందించనుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో చేతిలో బ్యాట్ పట్టుకుని ఉన్న రామ్‌చరణ్ లుక్ ఆకట్టుకుంటోంది.
మరో పక్క సినిమా ప్రమోషన్స్ కూడా ఉదృతం చేశారు. సంగీత దర్శకుడు ఏ. ఆర్. రెహమాన్ (A. R. Rahman) స్వరపరిచిన రెండు పాటలు ఇప్పటికే విడుదలై వైరల్ అయ్యాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బొమ్మన్ ఇరానీ తదితరులు నటిస్తున్నారు.