గురుశిష్యులతో రామ్ చరణ్ చేయనున్న మ్యాజిక్

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:32 PM

గురువు సినిమాతో బంపర్ హిట్ పట్టేసిన రామ్ చరణ్(Ram Charan) - శిష్యుని చిత్రంతోనూ అదే మ్యాజిక్ చేస్తారని ఫ్యాన్స్ అభిలాష.

గురువు సినిమాతో బంపర్ హిట్ పట్టేసిన రామ్ చరణ్(Ram Charan) - శిష్యుని చిత్రంతోనూ అదే మ్యాజిక్ చేస్తారని ఫ్యాన్స్ అభిలాష... మరో విశేషమేంటంటే - శిష్యుని మూవీ పూర్తి కాగానే గురువు సినిమాలోనే నటించడానికి చెర్రీ రెడీ అవుతున్నారట...


తండ్రిని మించేనా...


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా (Buchibabu Saana) డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న 'పెద్ది' చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ సినిమా నుండి వచ్చిన రెండు పాటలు ఇప్పటికే విశేషాదరణ చూరగొన్నాయి. అందువల్ల 'పెద్ది' సినిమా అనుమానాలేవీ లేకుండా బంపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ యేడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' ఇప్పటి దాకా బిగ్ హిట్ గా నిలచింది. ఈ మూవీని అన్ని విధాల క్రాస్ చేసే సినిమా 'పెద్ది'నే అని అభిమానులు ఆశిస్తున్నారు.  ఎందుకంటే 'మన శంకరవరప్రసాద్ గారు' ఆడియో కూడా అదరహో అనిపించి, తరువాత సినిమా సైతం అదే తీరున సాగింది. అదే మ్యాజిక్ ను చెర్రీ కూడా 'పెద్ది'తో క్రియేట్ చేస్తారని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.  బుచ్చిబాబు సానా గురువైన డైరెక్టర్ సుకుమార్ కూడా 'పెద్ది' నిర్మాణంలో పాలు పంచుకోవడం విశేషం. మరో విశేషమేంటంటే 'పెద్ది' తరువాత రామ్ చరణ్‌ నటించే చిత్రం సుకుమార్ దర్శకత్వంలోనే తెరకెక్కనుందని తెలుస్తోంది...

గురుశిష్యులతో... బ్యాక్ టు బ్యాక్...


తెలుగు చిత్రసీమలో ఎందరో దర్శకులు, వారి శిష్యులు పోటాపోటీగా సినిమాలు రూపొందించిన సందర్భాలున్నాయి. అలా సాగిన వారిలో దర్శకరత్న దాసరి నారాయణరావు, ఆయన శిష్యుడు కోడి రామకృష్ణ ముందుగా గుర్తుకు వస్తారు... ఒకే సీజన్ లో ఈ గురుశిష్యులిద్దరూ తమ సినిమాలను రిలీజ్ చేసి అభిమానులను అలరించిన సందర్భాలున్నాయి.  లోగడ సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' 2018వ సంవత్సరం బ్లాక్ బస్టర్ గా నిలచింది... అదే తీరున ఇప్పుడు సుక్కు శిష్యుడు బుచ్చిబాబు సానా కూడా 'పెద్ది'తో చెర్రీకి ఓ సూపర్ డూపర్ హిట్ అందిస్తారని ఫ్యాన్స్ భావన. 'పెద్ది' సినిమా కాగానే చెర్రీ నటించే చిత్రానికి సుకుమార్ దర్శకుడు కావడం మరింత విశేషంగా ముచ్చటించుకుంటున్నారు....

గురువు బాటలోనే శిష్యుడు...
'పెద్ది' చిత్రాన్ని వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు... ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తో కలసి సుకుమార్ కు చెందిన 'సుకుమార్ రైటింగ్స్' సంస్థ కూడా పంపిణీ చేయడానికి సిద్ధమయింది... ఈ సినిమాలో జాన్వీ కపూర్ నాయికగా నటిస్తున్నారు... శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బొమన్ ఇరానీ, విజీ చంద్రశేఖర్, సత్య - కీలక పాత్రధారులు... ఈ సినిమాకు ఎ.ఆర్.రహమాన్ స్వరకల్పన చేశారు... పాటలను బాలాజీ, అనంత శ్రీరామ్ పలికించారు... పాన్ ఇండియా మూవీగా 'పెద్ది' రానుంది... ఇప్పటికే గురువు సుకుమార్ రామ్ చరణ్ కు 'రంగస్థలం'తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు... అదే తీరున శిష్యుడు బుచ్చిబాబు కూడా చెర్రీకి మరపురాని విజయాన్ని 'పెద్ది'తో అందిస్తారేమో చూడాలి.

Updated Date - Mar 10 , 2026 | 04:39 PM