Ram Charan: కొత్త షెడ్యూల్ కోసం రామ్ చరణ్ బీస్ట్ లుక్
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:32 PM
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (peddi). బుచ్చిబాబు సానా (buchibabu Sana) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (peddi). బుచ్చిబాబు సానా (buchibabu Sana) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో తాజా షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్ కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. బీస్ట్ మోడ్ లో ఉన్న లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ 'చికిరి చికిరి' ఐదు భాషలలో 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది.
ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్, రామ్ చరణ్ వైరల్ డ్యాన్స్ తో ఈ సాంగ్ గ్లోబల్ మూమెంట్ గా మారింది. త్వరలోనే మరో పాటని రిలీజ్ చేయబోతున్నారు.వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతుంది. జాన్వి కపూర్ హీరోయిన్. మార్చి 27న పెద్ది సినిమా గ్రాండ్ గా పాన్ -ఇండియా స్థాయిలో విడుదల కానుంది.