మూడు రోజుల బ్రేక్ తర్వాత మళ్ళీ యాక్షన్‌లోకి చరణ్..

ABN , Publish Date - Nov 21 , 2026 | 06:39 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సినిమా కోసం ఎంత కష్టపడతాడు అనేది ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సినిమాకి ఆయన లుక్ ఛేంజ్ చేస్తూనే ఉన్నాడు. పెద్ది కోసం చరణ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు.

Ram Charan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సినిమా కోసం ఎంత కష్టపడతాడు అనేది ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సినిమాకి ఆయన లుక్ ఛేంజ్ చేస్తూనే ఉన్నాడు. పెద్ది కోసం చరణ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా కానీ, చరణ్ లుక్ కి మాత్రం మంచి ప్రశంసలు అందాయి. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో RC17 చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది. రంగస్థలం లాంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత చరణ్ - సుక్కు కాంబో అనేసరికి సినిమా మొదలవ్వకముందు నుంచే హైప్ క్రియేట్ అయ్యింది.


ఇక తాజాగా చరణ్.. ఈ సినిమా కోసం కొత్త లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మూడు రోజుల చిన్న విరామం తర్వాత రామ్ చరణ్ మళ్ళీ ఫుల్ యాక్షన్‌లోకి దిగాడు. ఈ సినిమాలో తన పాత్ర కోసం అవసరమైన ఇంటెన్స్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను చరణ్ అధికారికంగా ప్రారంభించినట్లు సమాచారం. తన పర్సనల్ ట్రైనర్ పర్యవేక్షణలో రామ్ చరణ్ ఇప్పటికే అత్యంత కఠినమైన జిమ్ వర్కవుట్స్, ప్రత్యేక ఫిట్‌నెస్ సెషన్లలో నిమగ్నమయ్యాడు. సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని ఒక సరికొత్త, పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.


సుకుమార్ అద్భుతమైన విజన్, రామ్ చరణ్ బీస్ట్ లుక్ కలిస్తే వెండితెరపై ఒక సినిమాటిక్ భూకంపం సృష్టించడం ఖాయమని మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం మెగా పవర్ స్టార్ ‘బీస్ట్ మోడ్’ ప్రిపరేషన్స్ మొదలవ్వడంతో మెగా అభిమానుల్లో పూనకాలు మొదలయ్యాయి. ఇక ఇంకోపక్క ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ఆకాశంలో ఒక తార ఫేమ్ సాత్విక వీరవల్లి నటిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి రంగస్థలం కాంబినేషన్ మరోసారి హిస్టరీ రిపీట్ చేస్తుందా.. లేదా అనేది చూడాలి.

Updated Date - Nov 21 , 2026 | 06:39 PM